టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి మూవీలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళితో సినిమా అంటే అది ఎప్పుడు పూర్తి అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరు అంచనా వేయలేరు. 2027లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటూ టాక్ వినిపిస్తున్నా.. అది అంత సులువు కాదు. సినిమా పూర్తి అయ్యే సమయానికి మరో రెండు మూడు ఏళ్లు పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ కు ఇంటర్నేషనల్ లెవెల్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. దీంతో.. మహేష్ కూడా తన తోటి హీరోలానే భారీ బడ్జెట్ సినిమాల ట్రాక్ లోకి వచ్చేస్తాడంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
కానీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఇతర హీరోల్లా కాకుండా ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇస్తూ ఓ వైవిద్యమైన డెసిషన్ తీసుకున్నాడట. అదేంటంటే.. రాజమౌళితో సినిమా తీసి సక్సెస్ కొట్టినా.. తన పాత కమర్షియల్ స్టైల్ లోనే సినిమాలు చేయాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే.. రీసెంట్ గా మహేష్ ఓ చిన్న డైరెక్టర్ కలిసి అతని కథను విన్నాడట. అది మహేష్‌కు వెంటనే నచ్చేయడంతో.. తను హీరో గానే కాదు, ప్రొడ్యూసర్ గాను సినిమాకు వ్యవహరించడానికి సిద్ధమయ్యాడంటూ టాప్ నడుస్తుంది. అసలు ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. రాజమౌళితో పాన్ వరల్డ్ ప్రాజెక్టు తర్వాత మహేష్ ఆ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఎలా ఒకే చెప్పాడు.. అనే సందేహాలు అందరిలోనూ మొదలైపోయాయి.
అయితే.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. అతను చిన్న డైరెక్టర్ అయినా కథ పైన నమ్మకంతో భారీ బడ్జెట్లో పాన్ ఇండియా లెవెల్ సినిమాను చేయడానికి మహేష్ సిద్ధమవుతున్నాడట. ఈ క్రమంలోనే కొత్త టాలెంట్ ప్రోత్సహించడంలో తప్పులేదు కానీ.. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని ఓ చిన్న డైరెక్టర్‌కు అంత బడా ప్రాజెక్టును అప్పగించడం కరెక్టేనా.. అతను ప్రాజెక్టు హ్యాండిల్ చేయగలడా అనే సందేహాలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. అయితే.. మహేష్ ఎప్పటికప్పుడు తన సినిమాల విషయంలో జాగ్రత్త వహిస్తాడు.. ఎంత నమ్మకం కుదిరితే గాని సినిమాల విషయంలో రిస్క్ తీసుకోడు. అలాంటిది ఓ చిన్న డైరెక్టర్‌కు ఇంత పెద్ద బాధ్యతలు అప్పజెప్తున్నాడు అంటే.. కచ్చితంగా అతనిలో ఏదో స్పెషల్ టాలెంట్ ఉండే ఉంటుందంటూ మరి కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.


