నేను విడాకులు తీసుకుంటే.. వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు.. షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన సమంత..!

స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినీ కెరీర్‌లో తిరుగులేని సక్సెస్ అందుకుంది. అయితే.. పర్సనల్‌గా మాత్రం.. చాలా సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సమంత లైఫ్ తెరిచిన పుస్తకం అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో సమంత సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. గతంలో. అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్యను వివాహం చేసుకొని.. అక్కినేని ఇంటి కోడలిగా, ఐడియల్ వైఫ్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే.. మెల్లమెల్లగా వీరి మధ్యన విభేదాలు తో 2021లో వెళ్లి విడాకులు తీసుకున్నారు.

Let me tell you the truth..' Samantha speaks out about divorce

ఈ డెసిషన్ సామ్ కెరీర్‌కే కాదు.. పర్సనల్ లైఫ్ కి కూడా చాలా ప్రభావాన్ని చూపించింది. ఇక డివోర్స్‌ తర్వాత సమంత పర్సనల్ లైఫ్ పై చాలా ప్రభావమే పడింది. సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్‌ చేస్తూ.. ఎంతో మంది నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ తెగ ట్రోల్స్ చేశారు. అయితే.. ఎప్పుడు వీటి పై సమంత రియాక్ట్ కాలేదు. తాజాగా ఇన్నాళ్ళ తర్వాత ఆమె మనసులో ఉన్న బాధను మొత్తం టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. సమంత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది. నా లైఫ్ లో జరిగిన విషయాలు నాకు ఒక పెద్ద పాఠంగా మారాయంటూ వివరించింది. నేను కూడా మనిషినే కదా.. అందుకే నేను తప్పులు చేశా.. నా నిర్ణయాల్లో కొన్ని సరైన‌వి కావు.. అవి నా లైఫ్ను ఎంతగానో ప్రభావితం చేశాయి అంటూ వివరించింది.

Samantha At NDTV World Summit: 'Did Oo Antava To See If I Could Be Sexy Too'

అంతేకాదు.. నా డివోర్స్ టైంలో కొంతమంది మాత్రం బాధపడిన.. కొంతమంది మాత్రం దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. నా బాధలో వాళ్లు ఆనందాన్ని వెతుక్కున్నారు. అది నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని విషయం అంటూ ఎమోషనల్ అయింది. నా లైఫ్ లో జరిగిన ప్రతి ఘటన నాకు కొత్త పాఠాని నేర్పిందని.. కెమెరా ముందు నిలబడి నా భావాలను చెప్పడం చాలా కష్టం. కానీ.. నేను తప్పించుకోవాలని అనుకోలేదు. నేను ఒక వర్కింగ్ ప్రోగ్రెస్ లాంటి వ్యక్తినంటూ వివరించింది. ప్రతి తప్పుతో నేర్చుకుంటూ వస్తున్నా. నా లైఫ్ లో ఉన్న వ్యక్తులను గురించి.. నాకు జరిగిన విషయాల గురించి.. ఇప్పుడు వివరంగా చెప్పలేకపోవచ్చు. కానీ.. సరైన టైంలో చెప్తా అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో.. సమంత విడాకులు తీసుకున్నప్పుడు అంతగా సంతోషించి సెలబ్రేషన్స్ చేసుకున్న వ్యక్తులు ఎవరై ఉంటారని సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఏదేమైనా.. ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత ఇంటర్వ్యూలో ఆమె లైఫ్ లో ఉన్న అంతర్గత బాధనంతా రివీల్ చేస్తూ.. చాలాకాలం నాటి నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్‌.