హీరో మెటీరియల్ వివాదం.. కిరణ్ అబ్బవరం స్ట్రాంగ్ కౌంటర్..!

టాలివుడ్ యంగ్‌ హీరో.. కిరాణ్ అబ్బ‌వరం లేటెస్ట్ మూవీ కే ర్యాంన్‌.. మరికొద్ది రోజుల్లో ఆడియన్స్‌ను ప‌లకరించడానికి సిద్ధమవుతుంది. ఈ ఏడాది దీపావళి కానుకగా.. అక్టోబర్ 18 గ్రాండ్గా సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ క్ర‌మంలోనే.. రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. తాజాగా.. సినిమా నుంచి ట్రైలర్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ని దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మీడియాతో ముచ్చటించారు. ఈవెంట్లో మీడియా ప్రతినిధులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు కిరణ్ ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పుకొచ్చాడు. అప్పుడు కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాధ‌న్‌కు సంబంధించిన‌ హీరో మెటీరియ‌ల్ వివాదం ఏ రేంజ్‌లో దుమారంగా మారిందో తెలిసిందే.

K-RAMP Official Trailer | Kiran Abbavaram | Yukti Thareja | Jains Nani |  Razesh Danda

ఆ వివాదమే.. ఇప్పుడు ప్రస్తావనకు రావడంతో.. ప్రదీప్ రంగనాథన్ కు సపోర్ట్ చేస్తూ, సదరు జర్నలిస్ట్‌కు కిర‌ణ్ స్ట్రాంగ్ కౌంటర్ వేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెటింట‌ వైరల్‌గా మారుతుంది. త్వరలో కిరణ్ అబ్బవరం కే రామ్ మూవీ తో పాటు.. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. డ్యూడ్ సినిమా ట్రైలర్ ఈవెంట్ సైతం గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఇక.. ఈ ఈవెంట్లో ఓ ఫిమేల్ జర్నలిస్ట్ ప్రదీప్ గురించి మాట్లాడుతూ.. మీరు హీరో మెటీరియల్ కాదంటూ చేసిన కామెంట్స్ నెటింట‌ పెద్ద దుమారంగా మారాయి. అంతా వాటిని ఖండిస్తూ ఆ ఫిమేల్ యాంకర్ పై దుమ్మెత్తి పోసారు. ఇప్పుడు ఇదే విషయంపై కిరణ్ సైతం రియాక్ట్ అయ్యారు. ఈ రేంజ్‌కు మీరు చాలా కష్టపడి వచ్చారు. ఇటీవల ప్రెస్‌మీట్‌లో ప్రదీప్ రంగనాథన్‌ను క్వశ్చన్ చేశా.. హీరోగా కష్టపడి వచ్చారు. కష్టాన్ని చెప్పాలనుకున్నారు.

We also need theatres in Tamil Nadu like Pradeep Ranganathan gets in Telugu  states", says Kiran Abbavaram

కానీ.. డీ గ్రేడ్ చేయాలనుకోలేదు.. ఇలాంటి బ్యాగ్రౌండ్ లో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగడం అంటే సాధారణ విషయం కాదని అడిగా.. అంటూ మాట్లాడుతుండగానే.. కిరణ్‌ జోక్యం చేసుకొని.. నన్ను అడగండి అమ్మ పర్లేదు. పక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళని అలా కించపరిచేలా మాట్లాడొద్దంటూ కౌంటర్ వేశాడు. మీరు నేను ఒకటే.. ఒక మాట అన్నా నేను పడతా. నాకు ఏది చెప్పినా వింటా. పక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం నీ లుక్స్ అలా ఉన్నాయి ఏంటి అని అడగడం చాలా బాధగా అనిపిస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి హీరోలు వస్తే రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ వివరించాడు. కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్‌కు జర్నలిస్ట్.. నేను అడిగిన క్వశ్చన్ ను పూర్తిగా తెలుసుకోలేదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొంతమంది మీడియా వాళ్ళు కూడా కావాలని నేను అడిగిన ప్రశ్న కట్ చేసి వైరల్ చేస్తున్నారని వివరించింది. ఏదేమైనా.. ప్రదీప్ విషయంలో కిరణ్ అబ్బ‌వరం సపోర్ట్ ఇస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతున్నాయి.