సౌత్ ఇండియాలోనే కాదు.. నార్త్‌లోను తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది సమంత. ఈ క్రమంలోనే అమ్మడుకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే.. బయటకు రావడం ఆలస్యం క్షణాల్లో తెగ వైరల్‌గా మారిపోతుంది. సమంతకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా.. అభిమానుల్లో మరింత హాట్ టాపిక్ గా మారుతుంది. ఆమె ఓ తెలుగు సినిమాలో నటిస్తుంది అంటే చాలు అభిమానుల్లో తెలియని ఉత్సాహం, ఆనందం, అందమైన చిరునవ్వు మొదలైపోతాయి. కానీ.. గత కొన్నేళ్లుగా సమంత తెలుగు ఆడియన్స్‌ను డిసప్పాయింట్ చేస్తూనే వస్తుంది.
ఒకప్పుడు వరుస సినిమాలతో తెలుగు ఆడియన్స్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. వ్యక్తిగత కారణాలతో.. డివోర్స్ తీసుకుని.. తర్వాత మయోసైటిస్ కారణంగా సినిమాలకు దూరమైంది. చాలా కాలం నుంచి ఒక్క తెలుగు సినిమాకు కూడా సైన్ చేయలేదు. అయితే.. ఆరుపదుల వయస్సులోను బాలీవుడ్ ప్రాజెక్టులకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ క్రమంలోనే.. తెలుగు ప్రేక్షకులు ఆమె విషయంలో చాలా నిరాశ వ్యక్తం చేశారు. ఇకపై.. సమంత మళ్ళి తెలుగు సినిమాల్లో కనిపించే అవకాశం కూడా లేదంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే.. తాజాగా ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ.. అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ సమంత చెప్పనుందట. సమంత త్వరలోనే ఓ బడా టాలీవుడ్ ప్రాజెక్టులో భాగం కానుందట.
ఆ సినిమా మరేదో కాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్‌లో రూపొందనున్న ఏఏ 22 అని.. మొదట సినిమాలో దీపికాను అనుకున్నా.. కల్కి 2 వివాదం కారణంగా.. ఆ సినిమాకు ఎదుర్కొన్న ఇబ్బందులే మా సినిమాకు కూడా ఎదురు కావచ్చనే ఉద్దేశంతో మేకర్స్ వెంటనే మరో ఆప్షన్ను ఫిక్స్ అయిపోయారట. అదే సమంత పేరని తెలుస్తుంది. ఇప్పటికే నిర్మాతలు, దర్శకుడు.. సినిమా విషయంలో సమంతతో చర్చలు కూడా జరిపేసారని.. ఆమె కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అన్పీ అనుకున్నట్లుగా జరిగితే.. త్వరలోనే దీన్ని అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించనున్నారట. ఇది నిజంగానే సమంత ఫ్యాన్స్ కు చాలా బిగ్ గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత.. సమంత గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందట. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ అఫీషియల్ ప్రకటన కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.