పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్, బాలీవుడ్ భాద్‌షా షారుఖ్ ఖాన్ సొంత సంస్థ.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలకు తాజాగా బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టు నుంచి న్యాయపరమైన ఇబ్బందులను ఈ సంస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా.. హైకోర్ట్ ఈ సంస్థలకు ఎన్‌సిబి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) నోటీసులు జారీ చేసింది. ముంబై జానర్ డైరెక్టర్‌గా పని చేసిన సమీర్ వాంఖడే.. ఈ సంస్థలపై నమోదు చేసిన పరువు నష్టం దాబా కేసులో నోటీసులు అందాయి. రెడ్ చిల్లీస్ యజమాని గౌరీ ఖాన్.. తన 55వ పుట్టినరోజు జరుపుకుంటున్న క్రమంలో ఈ నోటీసులు రావడం అందరికీ బిగ్ షాక్‌ను కలిగిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ఏ కాదు.. ఎక్స్, గూగుల్, మోటో ప్లాట్ ఫామ్ లు.. ఆర్పిఎస్, జి లైఫ్ స్టైల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్.. జాన్ డోలాకు కూడా ఈ నోటీసులో అందాయి.
ఈ ప్రతివాదులు అంతా ఏడు రోజుల్లోగా సరైన సమాధానాన్ని అందించాలని.. కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ కాపీలు అన్నింటినీ.. ప్రతివాదులకు అందించాలని.. వాంఖాడ్కు వివరించింది. అంతేకాదు.. నెక్స్ట్ హియరింగ్ ఈ నేల 30కి హైకోర్ట్ వాయిదా వేసింది. తన పరువు, ప్రతిష్టలను దిగజార్చిందని.. వాంఖాడ్ తన పిటీషన్ లో వెల్లడించాడు. రెడ్ చిల్లీస్ యజమానులు గౌరీ ఖాన్, షారుక్ ఖాన్ నుంచి రూ.2 కోట్ల నష్టపరిహారాన్ని వాంఖాడ్ డిమాండ్ చేశాడు. అంతుకాదు.. ఈ మొత్తాన్ని క్యాన్సర్ రోగుల చికిత్సల నిమిత్తం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇవ్వాలని ఆయన తన పిటీషన్లో వెల్లడించాడు.
వాంఖడ్ తరఫున సీనియర్ న్యాయవాది సందీప్ సేతి వాదనలను వినిపించగా.. పరువు నష్టం దావా వేసినందుకు ఆఫీసర్ ఫ్యామిలీపై టార్గెట్‌గా సామాజిక మాధ్యమాల్లో హింసించడం మొదలు పెట్టారని.. ఇప్పటికే తన భార్య, సోదరిని ట్రోల్ చేస్తున్నారని సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు ఉన్నాయంటూ వాంఖడ్ తన పిటీషన్లో వెల్లడించాడు. ఈ వాదనల క్రమంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బలమైన కారణాలు లేకుండా వెబ్ సిరీస్ నిషేధించలేం.. పిటిషన్ వేయడానికి ఒక కారణం ఉందని అంగీకరిస్తున్నామంటూ పేర్కొంది. అయితే.. సిరీస్ నిషేధించడానికి ఒక విధానం ఉంటుందని హైకోర్టు చెప్పుకొచ్చింది. ది బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించింది షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ముందు ముందు నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ కారణంగా మరిన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.