తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 కొద్ది వారాల క్రితం గ్రాండ్గా ప్రారంభమై.. ఇప్పటికీ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ షోలో ఒకప్పటి నటి ఫ్లోరా సైని కూడా కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇక ఈ అమ్మడు.. హౌస్‌లోకి అడుగు పెట్టేటప్పుడు ఆనందాంగానే ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత మాత్రం గేమ్ ఆడేందుకు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. సెకండ్ వీక్ నుంచే ఎప్పుడు ఎలిమినేట్ అయినా తనకు పర్లేదన్నట్లు ఆమె ఉంటుంది. ఈ క్రమంలోనే బిగ్బాస్ జైల్ శిక్ష కూడా ఎంతో ఎంజాయ్ చేసింది. సాధారణంగా జైల్ లైఫ్ అంటే ఎవరైనా బాధపడతారు. అవమానంగా ఫీల్ అవతారు.
కానీ.. ఫ్లోరా మాత్రం దాని తెగ ఎంజాయ్ చేసింది. జైల్ లైఫ్ నుంచి రిలీజ్ చేయమని బిగ్ బాస్ కెప్టెన్ కు ఆదేశించినప్పుడు బాగా డిసప్పాయింట్ అయింది. తెగ బాధ పడిపోయింది. కారణం పెద్దగా ఎవరితో కలవకపోవడం. తన పని మాత్రమే తాను చూసుకుంటూ.. హౌస్ లో ఉండాలన్న ఇంట్రెస్ట్ లేకుండా ఉండేది. ఈ క్రమంలోనే ఒకానొక టైం లో తను ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయినప్పుడు కూడా.. నిజమా అంటూ షాక్ అయ్యింది. తను కోరుకున్నట్లుగా 5వ వారం ఎట్టకేలకు బయటకు వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో సందడి చేస్తూ.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
ఇంటర్వ్యూ లోనే పెళ్లి గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. షో లోనే తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఇప్పటికే రిలేషన్ ను కంటిన్యూ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంపై రియాక్ట్ అవుతూ నేను రిలేషన్ లోనే ఉన్నా. కానీ.. పెళ్లి చేసుకునే ఉద్దేశం మాత్రం లేదు. కారణం.. పెళ్లి చేసుకున్న రెండుమూడు ఏళ్లకు విడాకులు అయిపోతాయి. అలా నా ఫ్రెండ్స్ లో చాలామందిని నేను చూసా. కనుక పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. రిలేషన్ షిప్ లోనే హ్యాపీగా ఉంటా అంటూ ఫ్లోరా సైని వివరించింది. ఫ్లోరా సైని అసలు పేరు ఆశా సైని. ఇక ఈ బ్యూటీ తెలుగులో ప్రేమ కోసం, నువ్వు నాకు నచ్చావు, చాలా బాగుంది, నవ్వుతూ బతకాలి, నరసింహుడు లాంటి సినిమాల్లో కీలకపాత్రలో మెరిసింది.