రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 దసరా కానుకగా రిలీజై ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకొన్ని దూసుకుపోతుంది. మూవీ రిలీజై 13 రోజులవుతున్న బాక్స్ ఆఫీస్ దగ్గర వాసుళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన కాంతర చాప్టర్ 1 పలు రికార్డులను సొంతం చేస్తుంది. రజినీకాంత్ కూలీ, జైలర్, 2.0 లైఫ్ టైం మూవీస్ తెలుగులో సాధించిన రికార్డ్స్‌ను క్రాస్ చేసి మరి రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా.. సౌత్ డబ్బింగ్ సినిమాలో నెంబర్ 2 పోజిషన్ దక్కించుకుంది.
ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 రూ.84 కోట్ల షేర్ తో మొదటి స్థానంలో నిలవగా.. కేజీఎఫ్ రికార్డ్‌ను కాంతర బ్రేక్ చేస్తుందా.. లేదా.. అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇలాంటి క్రమంలో సినిమా మరో బాక్సాఫీస్ రికార్డును బ్రేక్ చేసింది. రూ.670 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ఇంకా స్టడీ వాసుళ్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మూవీ మరో నయా రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రభాస్ సలార్ ఫుల్ రన్ లో రూ.630 కోట్ల గ్రాస్ కొల్లగొట్టగా.. రిషబ్ రూ.670 కోట్ల గ్రస్ దక్కించుకున్నాడు.
అంతేకాదు రజనీకాంత్ నటించిన 2.0 లైఫ్ టైం వశూళ్లను బీట్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా.. రూ.342 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజై.. రూ.670 కోట్ల కలెక్షన్‌లను సొంతం చేసుకుంది.మరో వారం రోజుల పాటు కాంతారఇదే జోరు చూపిస్తే ఖచ్చితంగా ఈ ఏడది హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడం కాయమంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.