సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది రష్మిక మందన. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన అంద చందాలతో.. కుర్రకారును కట్టిపడేసింది. నేషనల్ క్రష్‌గా ఫ్యాన్స్ హృదయాల్లో స్థానాన్ని దక్కించుకుంది. పుష్పా ది రూల్ నుంచి.. ఛావా సినిమా వరకు.. పాన్ ఇండియా లెవెల్‌లో వరుస హిట్‌లను అందుకొని.. బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. కాగా.. కొద్ది రోజులుగా రష్మిక తన సినిమాల కంటే.. పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో ఆమె నిశ్చితార్థం జరిగిపోయింది అంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ పుకార్లను మరింత బలం చేకూర్చేలా వీళ్ళిద్దరూ కొద్దిరోజులుగా ఒకే రకమైన ఉంగరాలను ధరించి కెమెరా కళ్ళకు చిక్కారు. రష్మిక బిగ్ డైమండ్ రింగ్ ధరించి.. విజయ్ సింపుల్ స్టైలిష్ బ్యాండ్ వేసుకుని ఉన్న ఫొటోస్.. వీడియోస్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా.. తాను నటించిన లేటెస్ట్ మూవీ ధామా ప్రమోషన్స్‌లో రష్మిక సందడి చేసింది. ఇందులో భాగంగా.. ఇంటర్వ్యూలో ఆమె విజయ్‌తో తన ఎంగేజ్మెంట్ పై ఇన్ డైరెక్ట్‌గా రియాక్ట్ అయింది.
ఇక ఈ ప్రమోషన్స్ లో ఇంటర్వ్యూవర్.. ఆమెకు విషెస్ తెలియజేసింది. రష్మిక కాసేపు ఆ విషెస్ ఎందుకో తెలియక కన్ఫ్యూజ్ అయింది. తర్వాత జర్నలిస్ట్.. సరదాగా ఇంకా ఏమైనా గుడ్ న్యూస్ ఉందా.. అని అడిగాంది. దానికి రష్మిక సిగ్గుపడుతూ.. చిరునవ్వుతో లేదు.. లేదు.. అంటూనే తన ఆన్సర్ ఇచ్చేసింది. నిజానికి చాలా విషయాలు జరుగుతున్నాయి. వాటన్నింటికీ మీ శుభాకాంక్షలు కచ్చితంగా తీసుకుంటా అంటూ నవ్వుతో సిగ్గుపడుతూ సమాధానం చెప్పింది. ప్రస్తుతం రష్మిక రియాక్షన్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారడంతో.. ఫ్యాన్స్ సైతం వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ నిజంగానే జరిగిపోయిందని.. అదే ఆమె ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చిందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ జంటకు సన్నిహితంగా ఉండే అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం.. 2026 ప్రారంభంలో వీళ్ళ పెళ్లికి ప్లాన్ చేసుకుంటున్నారట. దీనిపై అఫీషియల్ ప్రకటన్న రావాల్సి ఉంది.
View this post on Instagram