ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వల్‌గా జైలర్ 2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. అయితే.. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది. జైలర్ ఫస్ట్ హాఫ్‌లో కొనసాగిన కామియో రోల్స్‌తో పాటు.. బాలయ్య పాత్రను కూడా యాడ్ చేయబోతున్నారని.. ఈ పాత్ర ఇంటెన్స్ మిగతా క్యామియో పాత్రల కంటే పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది అంటూ టాక్ సోషల్ మీడియాలో హీటెక్కిస్తుంది. ఇప్పటికి.. ఈ చర్చ కొనసాగుతూనే ఉంది.
కృష్ణదేవ అనే పాత్రలో బాలయ్య కనిపించనున్నడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. మూవీలో బాలయ్య పాత్ర విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు. మేకర్స్ నుంచి.. ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే.. అభిమానుల్లోను బాలయ్య అసలు ఉన్నాడా.. లేదా.. అనే సందేహాలు మొదలయ్యాయి. దీనిపై బాలయ్య ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు సరికదా.. డైరెక్టర్ నెల్సన్ ని అడిగిన సరైన సమాధానం చెప్పకుండా సినిమాలో బాలయ్య భాగమైతే బాగుంటుందంటూ కామెంట్స్ చేశాడు. దీంతో.. మరిన్ని సందేహాలు మొదలయ్యాయి. జైలర్ మొదటి భాగంలో క్యామియో రోల్స్ గురించి నెల్సన్ రివీల్ చేయలేదు.. మోహన్లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రఫ్, ఉపేంద్ర పవర్ఫుల్ పాత్రలు పోషించిన విషయాన్ని బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు.

రజినీకాంత్ (ముత్తు వేలు పాండియన్)కు కష్టకాలంలో అప్పటికప్పుడు ఒకరి తర్వాత ఒకరు తెరపైకి వచ్చి సహాయం అందించినట్లు సర్ప్రైజింగ్‌గా చూపించారు. అప్పటివరకు.. సినిమాలో ప్రతి పాత్ర పై సస్పెన్స్ కొనసాగించారు. అదే తరహాలో.. బాలయ్య పాత్ర విషయంలోనూ సస్పెన్స్ కొనసాగిస్తున్నారా.. అనే సందేహాలు ఆడియన్స్ లో మొదలయ్యాయి. ఏదేమైనా.. జైలర్ 2లో బాలయ్య భాగమవుతున్నారని మేకర్స్ రివీల్ చేస్తే మాత్రం.. టాలీవుడ్ మార్కెట్లో సినిమాపై హైప్ మరింతగా పెరుగుతుంది. బోలెడంత ప్రచారం రిలీజ్ కు ముందే జరిగిపోతుంది. ఓపెనింగ్స్ లోను భారీ లాభాలు కొల్లగొట్టవచ్చు. ఇక.. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక.. బాలయ్య ఎంట్రీని చివరి నిమిషంలో అయినా రివీల్ చేస్తారా.. లేదా సస్పెన్స్‌ను కొనసాగిస్తారా.. అనేది వేచి చూడాలి.

