ఆ టైం లో భార్య పిల్లలతో కలిసి చనిపోదామని వీడియో తీశా.. భీమ్స్ ఎమోషనల్..!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఎన్నో అవమానాలు, కష్టాలు తర్వాత తనకంటూ ఒక స్టార్‌డంను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే.. ఎంతోమంది కొత్త వాళ్లకు ప్రోత్సహించే స్థాయికి ఎదిగాడు. అలా.. ప్రస్తుతం రవితేజ తన 75వ సినిమాకు ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎంతోమంది లైఫ్‌కు రవితేజ వెలుగునిచ్చాడు. ఉదాహ‌ర‌ణ.. ముగిసిపోతుందనుకున్న.. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియోకు ధ‌మకతో అవకాశం ఇచ్చి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మలిచాడు. ఇదే విషయాన్ని.. బీమ్స్ చాలా సందర్భాల్లో వివరించాడు. తనకు రవితేజ అంటే ప్రాణం అని మరోసారి గుర్తు చేసుకున్నాడు.

అప్పు చేసినా పర్లేదు..పాట చరిత్రలో నిలిచిపోవాలనుకున్నా'

తాజాగా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర అక్టోబర్ 31న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 28 మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు. ఇందులో భాగంగా బీమ్స్‌ స్టేజ్ పై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి.. ధమాకా నుంచి శివశంకర వరప్రసాద్ మూవీ వరకు నా వెనుక ఒక ధైర్యం.. అదేంటో మీకు చెప్పాలి. ఎట్లా నేను సేద్దును.. ఎట్లా పడి నేను సద్దునో అంటూ ఫోన్లో ఓ వీడియో తీసుకున్న. అప్పుడు నా భార్య, పిల్లలను కూడా వీడియో తీసా. నేనెందుకు వీడియో తీస్తున్నానో వాళ్లకు తెలియదు. ఇంటి అద్దే కట్టలేకపోయా.. పిల్లల్ని ఎలా చదివించాలి.. ఎలా బతకాలి.. రేపు ఎలా గ‌డుస్తుందని బిక్కు బిక్కుమంటూ చనిపోవాలని డిసైడ్ అయిన రోజుల్లో.. నాకు ఫోన్ కాల్ వచ్చింది.

Bheems Ceciroleo Emotional Words About Raviteja at #MassJathara Pre Release  Event |Suriya, Sreeleela - YouTube

పీపుల్స్ మీడియా ఆఫీసుకు రమ్మని ఆహ్వానించారు. అసలు ఊహించలేకపోయాను. భూమిపై నాకు నూకలు చెల్లిపోయాయి.. లైఫ్ అయిపోయింది.. భార్య పిల్లలతో చనిపోదాం అనుకున్న టైంకి దేవుడిలా ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు. ఆ శక్తి, వ్యక్తి, వ్యవస్థ ఇంకెవరు కాదు రవితేజ సార్. మాటల్లో చెప్పాలంటే ప్రేమ, పాటల్లో చెప్పాలంటే ఆయనపై భక్తి.. ఈరోజు నా నోట్లోకి 5 ఏళ్లు వెళుతున్నాయంటే ఆయన కారణం. అమ్మ‌, నాన్న మీ కొడుకు బ్రతికున్నాడు అంటే రవితేజ సర్ వ‌ల్లే. అవకాశాల కోసం కథ‌లు, కహానీలు ఎంతోమంది ఎన్నో చెప్తారు. కానీ.. నాకు అలాంటివి రావు. ఎప్పుడు కహానీలు చెప్పను.. అందుకే రవితేజ సర్‌కు నేనంటే ఇష్టం. నాకు ఆయనంటే అపారమైన గౌరవం అంటూ బీమ్స్ ఎమోషనల్ అయ్యాడు.. ప్రస్తుతం భీమ్స్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.