టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్, రానా ప్రధాన పాత్రలో నటించిన బాహుబలి ఎలాంటి సంచలనం సృష్టించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి క్యాతిని పెంచిన ఈ సినిమా.. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూషన్‌గా వచ్చీ.. బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసింది. ఇప్పుడు.. ఈ రెండు సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా స్పెషల్ చిట్ చాట్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా.. వీళ్ళు ముగ్గురు మాట్లాడుతూ చేసిన కామెంట్స్.. నెటింట వైరల్‌గా మారుతున్నాయి. బాహుబలి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే.. ప్రపంచ వ్యాప్తంగా రూ.3 కోట్లకు పైగా అడ్వాన్స్ టికెట్లు సేల్స్ జరిగిపోవడం విశేషం. దీనిబట్టి సినిమాపై ఆడియన్స్‌లో.. ఏ రేంజ్‌లో ఇంట్రెస్ట్ ఉందో అర్థమవుతుంది. థియేటర్‌లో బాహుబలి సాగా గ్రాండ్రీ రిలీజ్ కు ముందే డైరెక్టర్ రాజమౌళి, నటుడు ప్రభాస్, రానా దగ్గుబాటిలతో చిట్ చాట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో షూట్‌కు సంబంధించిన ఐకానిక్ సన్నివేశాలతో పాటు.. ఎన్నో విషయాల గురించి గుర్తుచేసుకున్నారు. అంతేకాదు.. రాజమౌళి, అనుష్క గురించి మాట్లాడుతూ.. ఆమెను ఎథెరియల్ బ్యూటీ అంటూ అభివర్ణించాడు. దాని అర్థం దైవిక అందం కలిగిన మనిషి అని రాజమౌళి ప్రత్యేకంగా ఫస్ట్ సినిమాలోని ఒక సీన్ గురించి చెబుతూ అనుష్క మాహిష్మతి లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె ఒక అద్భుతమైన ఆరాతో రియల్ బ్యూటీగా కనిపించింది.

ఆమె స్కేల్ ఎలా టర్న్ చేయగలిగింది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ దీనిపై రియాక్ట్ అవుతూ.. ఆమె అక్కడ అద్భుతంగా ఉంది. ఆమె కళ్ళల్లో ఏదో ఉంది. లేకపోతే బాహుబలి కాదు అని అన్నాడు. ఈ క్లిప్ ను మూవీ అకౌంట్‌లో షేర్ చేసుకున్నారు టీం. బాహుబలి మూవీ సిరీస్ లో అమరేంధ్ర బాహుబలి భార్య, శివుడు తల్లిగా దేవసేన పాత్రలో అనుష్క మెరిసింది. కుంతల రాజ్యానికి చెందిన యువరాణి పాత్రలో ఆమె ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి, ప్రభాస్ చేసిన ఈ కాబెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

