నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం షూట్‌లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన బాలయ్య.. ఈ ఏడాది చివరిలో అఖండ 2తో మరోసారి ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక.. ఈ సినిమా షూట్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్గా ఈ సినిమా తెరకెక్కుతుండడం.. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగవ సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి.
ఇక.. ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఎస్.ఎస్ థమన్ సంగీతమ అందిస్తున్నాడు. ఓజీని మించిపోయే నేంజ్‌లో ఈ సినిమాతో థమన్ సంచలనం సృష్టించడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య.. ఇప్పటివరకు నటించిన ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలకు థమన్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. బాలయ్య ఆస్థానం మ్యూజిక్ డైరెక్టర్గా థమన్ ప్లానింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే.. అఖండ 2కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ గురించి అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

తాజాగా.. దీనికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. అఖండ 2 ఫస్ట్ సింగిల్‌ను చాలావరకు వచ్చే నెల 5వ తేదీన రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట. దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా త్వరలోనే రివిల్ చేయనున్నట్లు టాక్ వైరల్ గా మారుతుంది. ఇక.. సినిమా ఫస్ట్ సింగిల్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటే మాత్రం.. సినిమాపై హైప్ ఆకాశానికి అంటుంది అనడంలో సందేహం లేదు. ఇక.. బోయపాటి ప్రమోషన్స్‌ను ఏ రేంజ్‌లో వర్కౌట్ చేస్తాడో.. బాలయ్యకు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.


