టాలీవుడ్ యాక్ట్ హీరో కిరణ్ అబ్బవరం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెల్లమెల్లగా తన సినిమాలతో ఆడియన్స్ లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే చివరిగా కా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కిరాణ్ ఇప్పుడు కే – ర్యాంప్‌తో మరోసారి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. జేమ్స్ నాని డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు.. రాజేష్ తండా, శివ బొమ్మకు సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.
ఇక అక్టోబర్ 18 గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించిన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. కాగా.. ఈ సినిమాలో కిరణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్‌తో పాటు.. కామెడీ టైమింగ్, హీరో హీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ, ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. ఈ సినిమాకు.. ఇప్పుడు పాజిటివ్ టాక్ వచ్చింది. పలు నివేదికల ప్రకారం ఏ సినిమా ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఆక్యుపెన్సి దక్కించుకోవడం విశేషం. ఆదివారం కూడా ఆక్యుఫెన్సీ భారీ లెవెల్లో జరిగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్.. సినిమాకు మొదటి ఛాయిస్ కాదట. మొదటి సినిమా కోసం యూత్ స్టార్ నితిన్ ను అనుకున్నారట. కథను నితిన్ కు వినిపించగా.. స్టోరీ బాగా నచ్చిందని ఓకే కూడా చెప్పేసాడట. తర్వాత ఏం జరిగిందో తెలియదు.. ఇలాంటి కథకు ఎలాంటి బ్యాగేజ్ లేని హీరో కావాలి.. నాలాంటి వాళ్లతో ఈ స్టోరీ వర్కౌట్ కాదని చెప్పి సినిమా నుంచి క్విట్ అయ్యాడట. దీంతో ఈ సినిమాకు కిరాణ్ అబ్బవరం ను తీసుకున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ కావడంతో.. నితిన్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.