బాహుబలి సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు రాజమౌళి. ఈ మూవీలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించి మంచి ఇమేజ్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగ.. కట్టప్ప రోల్ లో సత్యరాజ్ సినిమాకి హైలెట్ గా నిలిచాడు. ఇక.. ఈ సినిమా రెండు భాగాలను బాహుబలి ది ఎపిక్‌గా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి29 మూవీ షూట్ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే.. సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన ఎక్సైట్మెంట్ నెలకొంది. అయితే.. 2023లో రాజమౌళి ఎస్ఎస్ఎంబి29 కంటే ముందు.. మరో సినిమాను రిలీజ్ చేయబోతున్నాడంటూ టాక్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.

ఇంతకీ.. ఆ కొత్త మూవీ మరేదె కాదు.. బాహుబలి ది ఎటర్నల్ వార్. ఈ సినిమాను డైరెక్టర్ ఇషాంత్ శుక్ల తెరకెక్కించనున్నారు. అయితే.. ఈ సినిమాకు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించనున్నాడట. 2027 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా మొత్తం బాహుబలి యానిమేషన్ గా తెరకెక్కనుందని రాజమౌళి వివరించారు. దేశ రాక్షసులు యుద్ధంలో.. బాహుబలి ప్రమేయం ఎలా ఉంటుందనే విషయంపై.. మహావతార్ లాంటి యానిమేషన్ సినిమా.. రానుందంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. రాజమౌళి అనౌన్స్‌మెంట్‌తో అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది.

బాహుబలి సినిమా భాష సరిహద్దులు, దేశ సరిహద్దులను దాటేసి ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అందుకుంది. మరి.. బాహుబలి పేరుతో రాబోతున్నది ఎటర్నల్ వార్ ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసుకుంటుందో.. రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్ లో కలెక్షన్ లో రాబడుతుందో చూడాలి. ఇక నేడు.. గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన బాహుబలి మరోసారి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. చూసేసిన కథ అన్నట్లు కాకుండా ఎక్కడ బోర్ కొట్టకుండా.. రాజమౌళి థియేట్రికల్ విజువల్స్ అదిరిపోయేలా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా డిజైన్ చేశారు. ఈ క్రమంలోనే.. సినిమాపై పాజిటివ్ రివ్యూస్ వ్యక్తమవుతున్నాయి.

