మైత్రి మూవీ మేకర్స్ కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనే బిగ్ ప్రొడక్షన్ బ్యానర్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. నవీన్ యార్నెన్ని , వై.రవి శంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబు.. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. డబ్బింగ్ బ్లాక్ బస్టర్ అందుకున్న మైత్రి మేకర్స్ మంచి లాభాలను కూడా గడించారు. అలా.. పదేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ సక్సెస్ఫుల్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అంచలంచెలుగా ఎదుగుతూ.. ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన టాప్ ప్రొడక్షన్ బ్యానర్ గాను ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. తెలుగుతో పాటు.. సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషలలో ఇప్పటికే పలు సినిమాలతో ఆకట్టుకుంటున్నారు.
కాగా.. ఇటీవల కాలంలో మైత్రి మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను కూడా అందుకుంది. ఎన్నో సినిమాలను పంపిణీ చేస్తూ దాని వల్ల కూడా లాభాలను గడిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం 2026 మైత్రి లైనప్‌లో నాలుగు బడా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే వాటి సినిమా షూట్స్ కూడా సర్వేగంగా కంప్లీట్ చేస్తున్నారు టీం. ఇంతకీ ఆ లైనులో ఉన్న నాలుగు సినిమాలు బకేవోకాదు.. రామ్ చరణ్ – పెద్ది, పవన్ కళ్యాణ్ – ఉస్తాద్ భగత్ సింగ్, ప్రభాస్ – ఫౌజి, ఎన్టీఆర్ – డ్రాగన్.. ఈ నాలుగు సినిమాలకు మైత్రి సంస్థ 1000 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. స్టార్ హీరో చరణ్ పెద్ది వచ్చే ఏడాది మార్చ్‌లో రిలీజ్ కానుంది ఈ సినిమాకు దాదాపు రూ.350 కోట్లు బడ్జెట్ అయిందట.
ఇక.. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రూ.150 కోట్ల వరకు బడ్జెట్ అయిందని సమాచారం. వచ్చే ఏడాది ఆగస్టు 14న సినిమా రిలీజ్ చేస్తారని టాక్. ఇక ఈ సినిమాకు కూడా.. రూ.350 కోట్ల మేర బడ్జెట్ కేటాయించనున్నారట. అలాగే.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రజెంట్ మూవీ.. డ్రాగన్ సినిమా మైత్రి మేకర్స్ బ్యానర్‌లోనే రూపొందుతుంది. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. రూ.350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 2026 పవన్, ప్రభాస్, తారక్, చరణ్ సినిమాలతో ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించి మరి ఆడియన్స్ ముందుకి వస్తుంది. మరి.. ఈ సినిమాలతో మైత్రికి ఎలాంటి రిజల్ట్ అందుతుంది.. నలుగురు హీరోలతో సినిమాలు వర్కౌట్ అయో్యి ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకుంటారా లేదా చూడాలి.