స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగు ఆడియన్స్ లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుందో తెలిసిందే. బాలీవుడ్ నటి అయినా.. తెలుగులోను తన సత్తా చాటుకుంది. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి నటవరసరాలుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. కేవలం అందచందాలతోనే కాదు నటనతోను ప్రేక్షకులను మెప్పించింది. గ్లామర్ ట్రీట్ తో ఎప్పటికప్పుడు కుర్రకారును కట్టిపడేస్తూ సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక యంగ్ టైగ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఊహించిన రెంజ్‌లో సక్సెస్ అందుకోకపోవడంతో తెలుగు ఆడియన్స్‌లో అమ్మడిపై అంచనాలు కాస్త మేర తగ్గినా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే రామ్‌చరణ్, బుచ్చిబాబు సన్నా కాంబోలో పెద్ది సినిమా షూట్ లో బిజీగా గడుపుతుంది. ఇక ఈ సినిమా హిట్ అయితే మాత్రం టాలీవుడ్‌లో అమ్మడి మార్కెట్ డబల్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి క్రమంలోనే జాన్వికపూర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఇంటర్వ్యూలో.. మీరు ఎవరితో మీరు కిస్ సీన్ చేయాలనుకుంటున్నారు.. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలలో అయితే కిస్ సీన్స్ ఎవరితో చేస్తారు అనే ప్రశ్నకు క్రేజీ సమాధానాలు చెప్పుకొచ్చింది. ఆమె రియాక్ట్ అవుతూ టాలీవుడ్ లో ఇద్దరు హీరోల నేర్లు చెప్పింది. వారిలో ఒకరు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాగా.. మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు.
ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన పేరు ఓకే అనిపించినా.. మహేష్ బాబు పేరు కూడా చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికే మహేష్ కి పెళ్ళై, ఇద్దరు పిల్లలు ఉన్నా.. అలాంటి హీరోతో లిప్ లాక్ సీన్స్ చేయాలని ఉందంటూ ఆమె చేసిన కామెంట్స్ షాక్ కలిగిస్తున్నాయి. అయితే.. ఫ్యాన్స్ మాత్రం జాన్విని సమర్థిస్తూ ఆమె కచ్చితంగా వాళ్ళతో లిప్ లాక్ చేస్తానని అనలేదు. ఒకవేళ అవకాశమస్తే ఏ హీరోతో నటిస్తారనే ప్రశ్నకు కాజువల్ సమాధానమే ఇచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.