మిరాయి లో మనోజ్ రోల్ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఆ దురదృష్టవంతుడు ఎవరంటే..?

టాలీవుడ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్‌ గతవారం భారీ అంచనాల నడుమ రిలీజై.. స‌క్స‌స్‌ఫుల్‌గా దూసూఉకుపోతుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మహావీర్ లామా పాత్రలో మనోజ్ అందరివి ఆకట్టుకున్నాడు. తన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్, యాంగ్రీ లుక్స్ పూర్తిగా ఆడియన్స్‌ను మెస్మ‌రైజ్‌ చేసేసాడు.

ఇలాంటి క్రమంలోనే మనోజ్ పాత్రలో మరో టాలీవుడ్ హీరో నటించాల్సిందని.. ఆయన కథ‌ రిజెక్ట్ చేశాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఈ పాత్ర కోసం మరో టాలీవుడ్ హీరోను అనుకున్నారట. అతను మరెవరో కాదు సందీప్ కిషన్. మ‌నోజ్‌ ప్లే చేసిన మహావీర్ లామ రోల్‌ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమ‌నేని మొదట సందీప్ కిషన్‌కు ఆఫర్ చేశాడట. తేజ తో పాటు సందీప్ కిషన్ కు కూడా వేరే స్టోరీని కార్తీక్ వినిపించాడు.

Sundeep Kishan: Sundeep Kishan shares life lessons from SRK, Rajinikanth..కానీ.. సందీప్ స్టోరీ నచ్చినా.. అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ కారణంగా కథను రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది. దీంతో ఆ ఆఫర్లు మంచు మనోజ్ దక్కించుకున్నారు. మిరాయ్‌ సూపర్ హిట్ కావడంతో.. లాంగ్ గ్యాప్ తర్వాత మనోజ్ కెరీర్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం మనోజ్‌కు మంచి అవకాశాలు దక్కుతున్నయట. కాగా.. రికార్డ్ ఓపెనింగ్‌తో మిరాయ్‌ ఇప్పటికి అదే ఫామ్ లో దూసుకుపోతుంది. ఈ క్రమంలోని వీకెండ్ బ్రేక్ ఈవెన్‌ దాటేసి.. లాభాల బాటలోకి అడుగుపెట్టింది. రూ.100 కోట్ల మార్క్‌ సులభంగా దాట్గేసి ఫుల్ స్టడీగా ఇప్పటికే కొనసాగుతుంది.