నేషనల్ లెవెల్ లో తెలుగు సినిమా ఎదగడానికి కారణం ఆ నలుగురే.. తేజ సజ్జా

యంగ్ హీరో తేజస్ సజ్జా ప్రదాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో మంచు మనోజ్, శ్రీయ శరణ్, రితికా నాయక్ తదితరులు కీలక పాత్రల్లో మెర‌వ‌నున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజై ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాల నెలకొన్నాయి. ఇక ఈ సినిమా హిందీ రిలీజ్ బాధ్యతలను కరణ్ జోహార్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ముంబైలో ప్రెస్మీట్‌ ఏర్పాటు చేశారు టీం. ఈ ప్రెస్‌మీట్‌లో తేజసజ్జా మాట్లాడుతూ.. తెలుగు సినిమా నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కు ఎద‌గ‌డానికి రాజమౌళి సార్, అలాగే ప్రభాస్, తారక్‌, చరణ్ లు కార‌ణ‌య‌ని.. అన్ని విధాలుగా శ్రమించార‌ని.. వీళ్ళు విలువైన టైం ని, ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేసి సినిమాల కోసం కష్టపడ్డారని.. ఇప్పుడు వాళ్లు వేసిన దారిలోనే మేమంతా సులభంగా నడుస్తున్నాం అంటూ వివ‌రించాడు.

మా సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామంటూ వివరించాడు. నెక్స్ట్ రాజమౌళి సార్ నుంచి ssmb29, రిష‌భ్ శెట్టి.. కాంతార 2, ప్రభాస్ కల్కి 2 లాంటి సినిమాలు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పాన్ వరల్డ్ రేంజ్‌లో రిలీజ్ అవుతాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తేజసజ్జా.. మీరాయ్‌ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. ఇది అందరూ చెప్పేదే. కానీ.. నాకు చెప్పక తప్పదు. కొన్ని పరిమితులు, సమస్యలున్నా.. మా డ్రీమ్స్ చిన్నవి కాదు.. ఇండియా బిగ్గెస్ట్ మూవీ గా మీరాయ్‌ని తీర్చిదిద్దడానికి ఎంతగానో కష్టపడుతున్నాం. నిర్మాత విశ్వప్రసాద్ మమ్మల్ని చాలా నమ్మి డబ్బు ఇవ్వడమే కాదు.. ఎమోషనల్ గాని మమ్మల్ని ఎంతో యంకరేజ్ చేస్తున్నారు.

ఈ మూవీని హిందీలో తీసుకొస్తున్న కరణ్ సార్‌కి నా ధన్యవాదాలు. హిందీ ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. మీకు.. నచ్చే మరిన్ని సినిమాలను కచ్చితంగా తీసుకొస్తాం అంటూ తేజ సజ్జ వివరించాడు. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, గ్లింన్స్‌ ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హనుమాన్ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఇప్పటికే ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో తేజా.. జపాన్, ఇండియా లెవెల్లో తెలుగు సినిమా నిలవ‌డడానికి కారణం అంటూ నలుగురు పేర్లు మాత్రమే చెప్పడం.. సుకుమార్, అల్లు అర్జున్ పేర్లు పుష్ప సినిమా పేరు ఇందులో రాకపోవడంతో.. బ‌న్నీ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ముందు ముందు ఈ కామెంట్స్ ఇంకెలాంటి కాంట్రవర్సీలకు దారితీస్తాయో చూడాలి.