‘ మీరాయ్ ‘ స్టోరీ ఇదే.. తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. హ‌నుమాన్‌తో పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా ఆయన సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. మంచు మనోజ్‌, జగపతిబాబు, శ్రీయా, రితికా నాయక్ తదితరులు కీలకపాత్రలో మెరవ‌నున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ ఈ నెల 12న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్గా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు టీం.

ఇందులో భాగంగానే చెన్నై ప్రమోషనల్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న తేజ మాట్లాడుతూ.. థియేటర్లకు వెళ్లి చూడాలని కొన్ని సినిమాలకే అనిపిస్తుంది.. అలాంటి లిస్టులోకే మీరాయ్‌ చేరుతుందంటూ కామెంట్స్ చేశాడు. యాక్షన్ అడ్వెంచర్స్ ఫాంటసీ కథ‌ అంశంతో కూడిన ఈ సినిమా.. 3ఏళ్ల పిల్ల‌ల‌ నుంచి 80 ఏళ్ల పెద్దల వరకు అందరికీ నచ్చేస్తుందని.. అలా కథను డిజైన్ చేశారంటూ వివరించాడు. మీరాయ్‌ అంటే భవిష్యత్తు నమ్మకం అని చెప్పుకొచ్చాడు. మరో అర్థం కూడా ఉందంటూ వివరించిన ఆయన.. ఈ సినిమాలో ట్విస్ట్‌తో అది తెలుస్తుందని.. మహాజ్ఞాన సంపన్నుడు అశోక్ చక్రవర్తి తన పొందిన జ్ఞానాన్ని ఒక గ్రంథం గా రచించాడు. అది ఒకే చోట ఉంటే ప్రపంచానికి ముప్పని భావించే 9 గ్రంథాలుగా విభజించాడు. 9 గ్రంథాలను 9 మంది యోధులకు ఇచ్చి దాని పరిరక్షణ బాధ్యతలు వాళ్లకు అప్పజెప్పాడంటూ చెప్పుకొచ్చాడు.

హిట్​ వైబ్స్ ఇస్తోన్న తేజ సజ్జా 'మిరాయ్' ట్రైలర్.. ఆకట్టుకుంటున్న డైలాగ్స్,  విజువల్స్, శ్రీరాముని దర్శనమైతే పైసా వసూలే | Mirai Trailer Out Now Teja  Sajja ...

ఇక‌ 2025 లో ఒక ఈవిల్ ఫోర్స్.. ఒక్కొక్కటిగా వాటన్నింటినీ దొంగలిస్తాడని.. అతని నుంచి హీరో ఆ గ్రంథాలను ఎలా కాపాడాడు అనేదే క‌థాంశం అంటూ వివరించాడు. ఎలాంటి విపత్తు వచ్చిన దాన్ని ఆపడానికి ఇతిహాసాల్లో ఒక ఖచ్చితమైన సమాధానం ఉంటుందని. అలా హీరో తన ధర్మాన్ని తెలుసుకొని విపత్తును ఎలా నిరోధించాడు అన్నదే సినిమా అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. మీరాయ్‌ సినిమా.. చైనా, జపాన్ దేశాల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఈ దేశాల్లో భారతీయ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఇంతకుముందు నేను నటించిన‌ హనుమాన్ సినిమా చైనా, జపాన్లో విడుదల మంచి సక్సెస్ అందుకుంది అంటూ తేజ వివరించాడు. ఇక సినిమా విఎఫ్ఎక్స్ చేయడం చాలా పెద్ద టాస్క్ అయిందని.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో సినిమాను కంప్లీట్ చేశామంటూ వివరించాడు. ప్రస్తుతం తేజ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.