కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా మదరాసి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమాకు మురగదాస్ దర్శకుడుగా వ్యవహరించారు. ఇక సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న క్రమంలో.. హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. చిరు, మహేష్ లాంటి స్టార్స్ ను డైరెక్ట్ చేసిన మురగదాస్ డైరెక్షన్‌లో నేను సినిమా నటించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సినిమాకు నా ప్రాణ స్నేహితుడు మ్యూజిక్ అందించాడు.
అతని మ్యూజిక్ ఫైర్ అంటూ వివరించిన శివ కార్తికేయన్.. తన మ్యూజిక్ సినిమాకు ఉందంటే కచ్చితంగా హిట్ అవుతుంది.. ఇక నిర్మాత ప్రసాద్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆయన ఎప్పటికైనా బడా సినిమాలను నిర్మించాడు. కంటెంట్ నచ్చితే ఖర్చు విషయంలో ఎక్కడ రాజీపడడు.. తెలుగు సినిమాలు అందుకే ఎప్పుడు రూ.1000 కోట్ల క్లబ్లో చేరుతూ వస్తున్నాయి. రుక్మిణి చాలా టాలెంటెడ్. ఆమెతో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నా. ఇందులో యాక్షన్ సీన్స్ మరో లెవెల్ లో ఉంటాయి. సక్సస్ కంటే మీ ప్రేమాభిమానాలు నాకు ముఖ్యమంటూ శివ కార్తికేయన్ వివరించారు.
ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఇండస్ట్రీకి రావడానికి తనకు రజనీకాంత్ ఇన్స్పిరేషన్ అని.. నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచే మిమిక్రీ చేసే వాడిని అంటూ వివరించాడు. నా స్నేహితులను ఫస్ట్ నుంచి ఎంతగానో ఎంకరేజ్ చేసే వాళ్ళని.. నేను ఉన్నత స్థానాలకు వెళ్తానని వాళ్లు గట్టిగానే అన్నారు. అంతే కాదు.. నా భార్య ఆర్తి కూడా నన్ను చాలా నమ్మింది. సినిమాల్లోకి రాకముందు నన్ను నమ్మి వివాహం చేసుకుంది. అప్పట్లో నాకు పెద్ద శాలరీ కూడా లేదు. అయినా నాపై ఆమెకు నమ్మకం ఉండి నాతో నడిచింది. తను నా లైఫ్‌లోకి రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ వివరించాడు. ఇక సినిమాల్లోకి రాకపోయి ఉంటే నేను నాన్నకి లాగా పోలీస్ అయ్యేవాడినంటూ వివరించాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.