వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఎన్టీఆర్.. మరోసారి ఫ్యాన్స్‌ను కలిసేందుకు సిద్ధం అవుతున్నాడు. అది కూడా ఓ స్టార్ హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ సందడి చేయనున్నాడు. ఆ మూవీ మరేదో కాదు కాంతార. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సస్ అందుకుంది. ఈ క్రమంలోనే మోస్ట్ అవైటెడ్ ప్రిక్వెల్‌గా కాంతర చాప్టర్ 1 రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమాకు తనే స్వయంగా దర్శకత్వం వహించి మరి నటించాడు రిషబ్ శెట్టి. ప్రఖ్యాత పాన్ ఇండియన్ ప్రొడక్షన్ బ్యానర్ హేంబలే ఫిలిమ్స్ రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 2 న దసరా కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు టీం. ఇటీవల రిలీజైన థియేట్రికల్ ట్రైలర్.. అన్ని భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. హైప్ పీక్స్ లెవెల్‌కి వెళ్ళింది. ఈ క్రమంలోనే.. సెప్టెంబర్ 28న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నాడు. ఎన్టీఆర్ ఎంట్రీతో సినిమా ఫ్రీ రిలీజ్ ప్రమోషన్స్ కు మరింత బజ్ పెరిగిందనడంలో సందేహం లేదు.
ఇది నిజంగానే కాంతర తెలుగు వర్షన్ కు మంచి బూస్టప్ అవుతుంది. ఇక తెలుగు వర్షన్లోనూ.. సినిమాపై హైప్ డబల్ అవుతుంది. ఇక పార్ట్ 1లో మైథిలాజి, రీజనల్, ట్రెడిషన్స్ ని ఏ రేంజ్ లో ఆవిష్కరించారో చూసాం. ఇప్పుడు అంతకు మించిపోయారు రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని.. విజువల్ వండర్స్ క్రియేట్ చేయడం ఖాయం అంటూ తెలుస్తుంది. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమా.. ఫెస్టివల్ సీజన్ లో వస్తున్న క్రమంలో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా మారనుంది. ఇక సినిమా కాంతార లెవెల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందా.. ఆడియన్స్ అంచనాలకు రీచ్ అవుతుందా.. లేదా.. చూడాలి.