పవన్, మహేష్ లతో మూవీస్ చేసిన స్టార్ హీరోయిన్‌.. 4గురితో ఎఫైర్స్ వ‌ల్ల‌ కెరీర్ స్పాయిల్.. 5 పదుల వయసులోనూ ఇప్పటికీ సింగిల్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. నాని సినిమా హీరోయిన్ అమీషా పటేల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తన అందంతో అంద‌రిని కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలే అయినా బాలీవుడ్ లో మాత్రం ఒక సెన్సేషనల్ హీరోయిన్గా మారిపోయింది. కెరీర్‌ స్టార్టింగ్ లోనే హృతిక్ రోషన్ తో జతకట్టిన ఈ అమ్మడు.. బాలీవుడ్‌ను షేక్ చేసింది. అయితే.. తెర‌పై ఎంత సక్సెస్ చూసిందో.. పర్సనల్ లైఫ్ లో అంతకుమించిపోయే వివాదాలతో వైరల్ అయింది. లవ్ స్టోరీ సాధారణమైనవి కావు.. సినిమాలకు మించిన ట్విస్టులు.. అమ్మడి ఎఫైర్లలో ఉన్నాయి. ఈ క్రమంలోనే 49 ఏళ్ళ వయసులోనూ సింగిల్ లైఫ్ లీడ్‌ చేస్తుంది. అయితే.. ప్రస్తుతం ఓ బిజినెస్ మాన్ తో క్లోజ్ గా ఉన్న ఫొటోస్ వైరల్ గా మారుతున్నాయి.

Pictures of Amisha Patel and Mahesh Babu from film Naani

ఇంతకీ అమ్మడి ఎఫైర్స్ అన్ని పెళ్లయిన వాళ్లతోనే కొనసాగాయి. మొదట డైరెక్టర్ విక్రమ్ బార్గ్‌ తో ప్రేమాయణం నడిపిన ఈమె.. ఐదేళ్లపాటు అతనితో కలిసి ప్రయాణం చేసింది. అప్పట్లో ఇది పెద్ద దుమారమే. ఎందుకంటే అప్పటికే విక్రమ్‌కు వివాహం అయిపోయింది. ఇక అతని నుంచి విడిపోయిన తర్వాత అది నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అంటూ అమీషా క్లారిటీ ఇచ్చింది. తర్వాత.. 2008లో లండన్ కు చెందిన బిజినెస్మేన్.. క‌న‌వ్‌ పూరితో అమ్మడు రిలేషన్ లో ఉంది. రెండేళ్ల తర్వాత పెళ్లి కంటే కెరీర్ ముఖ్యమని అతనికి కూడా బ్రేకప్ చెప్పేసిన అమీషా.. నిర్మాత కునాల్ కుమార్ తో సైతం రిలేషన్ మెయింటైన్ చేసింది. అంతే కాదు.. కునాల్ అతని భార్య షామిలీతో కలిసి ఒకే ఇంట్లో కాపురం పెట్టిందని టాక్‌ కూడా వినిపించింది.

ముగ్గురితో ఎఫైర్ న‌డిపిన ప‌వ‌న్ హీరోయిన్ అమీషా.. ఆ కార‌ణంతోనే పెళ్లికి  దూర‌మైందా..! - Telugu Lives

ఈ విషయంపై ఆమె ఎప్పుడు రియాక్ట్ కాలేదు. ఇక ఈ ఎఫైర్ తర్వాత కొంతకాలానికి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ వాడియాతో ఆమె ప్రేమలో ఉందంటూ టాక్ వినిపించింది. మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఈ రూమర్లకు చెక్ పెట్టేసింది అమీషా. ఇటీవల తన దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రముఖ బిజినెస్ మ్యాన్ నిర్వాన్ బిర్లా ఒళంలో కూర్చుని ఇద్దరు ఒకే రంగు డ్రెస్సులతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేసింది. దానికి తోడు ల‌వ్ ఇమోజీల‌లు పెట్టడం.. నిర్వాన్ లవ్ యు అని రిప్లై ఇవ్వడంతో ఈ పోస్ట్‌ తెగ ట్రెండ్ అయ్యింది. ఇద్ద‌రి మధ్య ఏదో రిలేషన్ నడుస్తుందని టాక్ మొదలైపోయింది. కానీ.. మేము జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మ్యూజిక్ ఆల్బమ్ షూటింగ్ కోసమే అక్కడ కలిశాం అంటూ నిర్వాన్ వెల్లడించారు. ఇక ఇన్ని లవ్ ఎఫైర్లు ఎదుర్కొని కెరీర్ నాశనం చేసుకున్న తర్వాత కూడా అమీషా ప్రేమా విషయంలో మాట్లాడుతూ.. తను నిజమైన ప్రేమను నమ్ముతానంటూ కామెంట్ చేసింది. ఇన్ని లవ్ ఫెయిల్యూర్ లు చూసిన ఆమె.. చేసిన ఈ కామెంట్స్ అందరికి షాక్‌ను కలిగిస్తున్నాయి. డబ్బు, హోదా కంటే తనకు నమ్మకం, గౌరవం, ఇంటలెక్చువల్ కనెక్షన్ చాలా ముఖ్యమంటూ ఆమె వివరించింది. ఇక ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా కెరియర్ పై ఫోకస్ చేస్తూ రానిస్తుంది అమీషా.