టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న మూవీ SSMB 29. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా సెట్స్‌పైకి రాకముందే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కరణం రాజమౌళి డైరెక్షన్. అది కూడా పాన్ వరల్డ్ రేంజ్లో అంటే.. ఆయన ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే అంచనాలు ఆడియన్స్ లో అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే.. సినిమా అనౌన్స్మెంట్ వచ్చి రెండు ఏళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా ఇవ్వకుండా రాజమౌళి గోప్యంగానే ఉంచుతున్నాడు. ఈ విషయంలో మాత్రం మహేష్ ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి క్రమంలో.. తాజాగా SSMB 29 సెట్స్ నుంచి ఓ క్రేజి ఫోటో వైరల్ అవుతుంది. ప్రస్తుతం SSMB 29 టీం కెన్యాలో షూట్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కెన్యాలోని నైరోబిలో సన్నివేశాలను షూట్ చేస్తుండగా.. ఈ ఫోటో క్లిక్ చేశారట. ఇక.. తాజాగా ఈస్ట్ ఆఫ్రికాలోనికి కెన్యాలో రాజమౌళి టీం లేటెస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఇందులో భాగంగానే.. ఈ ఫోటో బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో దాదాపు.. 95 శాతం సౌత్ ఆఫ్రికా సీన్స్ అన్ని కెన్యా ప్రాంతంలోనే షూట్ చేయనున్నారట.
ఇదిలా ఉంటే.. కెన్యా షెడ్యూల్ పూర్తయిన తర్వాత రాజమౌళి అక్కడ విదేశాంగ మంత్రి ముసలియ ముదవాడిని మర్యాద పూర్వకంగా కలిసి ఆయనతో చర్చించాడు. షూటింగ్ కి కావాల్సిన అనుమతులన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసిన రాజమౌళి.. సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను అతనితో షేర్ చేసుకున్నట్లు సమాచారం. షూట్ ఎలా జరుగుతుంది.. సినిమా ఎన్ని దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయనతో పంచుకున్నట్లు.. జక్కన్న కన్యాలోని సుందరమైన ప్రదేశాలను తను సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ ముసలియ ముదవాడి వెల్లడించారు. ఎక్స్ వేదికగా రాజమౌళి పై ప్రశంసలు వర్షం కురిపించారు. ఇక సినిమా 120 దేశాల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇలాంటి క్రమంలో సినిమా నుంచి రిలీజ్ అయిన ఇంట్రెస్టింగ్ పిక్ నెటింట సందడి చేస్తుంది.