ఆ హిట్ ఫ్రాంచైజ్ లో రష్మిక ఎంట్రీ.. మరో బ్లాక్ బస్టర్ పక్కా..!

సౌత్ స్టార్ బ్యూటీ రష్మిక మందన.. నేషనల్ క్రష్‌గా పాన్ ఇండియా లెవెల్‌లో తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పుష్ప ఫ్రాంఛైజ్‌ల‌తో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకోవాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే తనకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోకుండా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. అలా.. ఇప్పుడు మరో హిట్ మూవీ ఫ్రాంచైజ్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని టాక్ బాలీవుడ్ వర్గాల్లో తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ హిట్ ఫ్రాంచైజ్ మరేదో కాదు.. క్రిష్. ఇప్పటికే మూడు ఫ్రాంచైల‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. నాలుగో భాగం త్వరలోనే రానుందట.

KRRISH 4 ( concept art ) #krrish4 #krrish3

హృతిక్ రోషన్ నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు.. డైరెక్టర్ గాను తానే బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. ఇక గత మూడు ఫ్రాంచైజీ సినిమాలలానే.. ఈ సినిమా కూడా సూపర్ హీరో ఎలిమెంట్స్ తో, యాక్షన్ సీన్స్ తో.. విజువల్ ఎఫెక్ట్స్ తో.. నెక్స్ట్ లెవెల్ లో డిజైన్ చేస్తున్నారు. బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఇప్పటికే క్రిష్ 4 టీం.. రష్మికను అప్రోచ్ అయ్యార‌ని.. ఆమె సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది అంటూ టాక్‌ నడుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రానుందట. ఇక ఈ వార్తల వాస్తవం ఎంతో తెలియదుగానీ.. నిజంగానే రష్మిక.. క్రిష్ 4లో ఎంట్రీ ఇస్తే మాత్రం ఈ ప్రాజెక్టుకు మరింత బ‌జ్‌ క్రియేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.

Krrish 4: Rashmika Mandanna in Talks - TrackTollywood

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రష్మికకు ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది. అదే క్రేజ్‌తో బాలీవుడ్‌లో మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తుంది, ఈ క్రమంలో,, రష్మిక ఫ్యాన్స్,, హృతిక్ రోషన్, రష్మిక కాంబో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వరస బ్లాక్ బ‌స్టర్లతో ఫామ్ లో ఉన్న రష్మిక.. ఈ హిట్ ఫ్రాంచైజ్‌లో నటిస్తే ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.