టాలీవుడ్ ఆల్ టైం సూపర్ హిట్ ఫేవరెట్ ఆల్బమ్స్ లో పవన్ కళ్యాణ్ రమణ గోగుల్ కాంబో మొదటి వరుసలో ఉంటుంది. పవన్ నటించిన ఎన్నో సినిమాలకు వన్ అఫ్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినది ఎవరంటే.. వెంటనే రమణ గోగుల్ పేరే గుర్తొస్తుంది. అంతలా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పటికి యూత్ లో ఈ సాంగ్స్ మారుమోగుతూనే ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఓ మిస్సమ్మ మిస్సమ్మ నుంచి మొదలుకొని.. వయ్యారి భామ నీ హంస నడక, మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సాంగ్స్ వీళ్ళిద్దరి కాంబోలో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
వీళ్లిద్దరు కాంబోలో చివరగా అన్నవరం సినిమా తెరకెక్కింది. అయితే తర్వాత రమణ గోగుల్ మెల్లమెల్లగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఏడాది సంక్రాంతి బరిలో.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం గోదారిగట్టు మీద రామచిలకవే అంటూ ఆలపించిన సాంగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టారో చెప్పనవసరం లేదు. 3 ఏళ్ల చిన్నపిల్లల నుంచి.. 90 ఏళ్ల ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరిని ఈ సాంగ్ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మరోసారి రమణ గోగుల్, పవన్ కళ్యాణ్ కాంబో రిపీట్ కానుందని టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో రమణ గోగుల్ ఓ సాంగ్ ను పాడనున్నాడట. ఇదే వాస్తవమైతే.. బాక్సాఫీస్ బ్లాస్ట్ కాయమంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఈ సినిమాకు డిఎస్పి మ్యూజిక్ అందిస్తున్న క్రమంలో.. డిఎస్పీ మ్యూజిక్, రమణ గోగుల్ వాయిస్‌కు పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తోడైతే సిల్వర్ స్క్రీన్ షేక్ అవడం ఖాయం అని.. మరోసారి పవన్, రమణ మ్యాజిక్ సిల్వర్ స్క్రీన్ పై చూడచంటే తెగ మురిసిపోతున్నారు ఫ్యాన్స్. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.