టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో పాపులారిటి సంపాదించుకున్న చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అంతేకాదు.. లైనప్‌లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉండనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో చరణ్ కేవలం సినిమాల్లోనే కాకుండా.. సరికొత్త బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని.. ఈ బిజినెస్‌తో కాసుల వర్షం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చరణ్ ఒక్కడే కాదు.. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీల్ గా రాణిస్తున్న ఎంతోమంది.. సినిమాల్లో ఇతర బిజినెస్ లపై కూడా ఇన్వెస్ట్ చేస్తూ భారీగా కూడా పెడుతున్నారు.
ఆ బిజినెస్ లలో థియేటర్ బిజినెస్ కూడా ఒకటి. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న మహేష్, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ ఈ థియేటర్ల బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఇదే లిస్టులోకి మెగా హీరో రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇవ్వను న్నాడట. ఇదే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబుకి – ఏఎమ్‌బి మాల్, అల్లు అర్జున్‌కి – ఏఏఏ, రవితేజకు – ఏఆర్టి, విజయ్ దేవరకొండకు – ఏవిడి పేర్లతో మల్టీప్లెక్స్ లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత పంపిణీ దారుడు ఏషియన్ సునీల్‌తో కలిసి వీళ్ళు ఈ బిజినెస్లను చేస్తున్నారు.
ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని.. దీన్ని త్వరలో అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ హీరోల అందరికీ తెలంగాణలో మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలైంది. అయితే కొద్ది రోజుల్లో అల్లు అర్జున్ తన ఏఏఏ సినిమాస్‌ను వైజాగ్ లోనో లాంచ్ చేయనున్నాడు. ప్రస్తుతం.. థియేటర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా ఆంధ్రాలో ఏఆర్సి సినిమాస్ పేరుతో ఓ బడా మల్టీప్లెక్స్ ప్రారంభించనున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఈ బిజినెస్ ఉందని.. త్వరలో ఎక్కడ మల్టీప్లెక్స్ స్థాపించాలనేది ఫిక్స్ కానున్నట్లు సమాచారం. చరణ్ కూడా వైజాగ్ లోనే థియేటర్ నిర్మిస్తాడా.. లేదా విజయవాడ, తిరుపతి లాంటి ఇతర బిగెస్ట్ సిటీలను ఆప్షన్లుగా ఎంచుకుంటాడా వేచి చూడాలి.