ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ది రాజా సాబ్. మారుతి డైరెక్షన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై.. టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై.. ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక.. తాజాగా ట్రైలర్ రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇందులో హారర్ ఎల్మెంట్స్‌తో పాటు.. ప్రభాస్.. వింటేజ్ స్క్రీన్ ప్రజెన్స్.. ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాంటిక్ సీన్స్.. ఇలా ప్రతి ఒక్కటి ఆడియన్స్‌ను మెప్పించాయి. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం.. ట్రైలర్‌ను ఇష్టపడుతున్నారు.
అయితే.. ఈ ఓవరాల్ ట్రైలర్ లో ఒకే ఒక మైనస్.. థమన్ మ్యూజిక్ అని.. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టు ఒక్క ఎలివేషన్ కూడా ఇవ్వలేదని.. చాలా డల్ బిజీయంతో సినిమా ట్రైలర్ అంత కొనసాగిందంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రేంజ్ లో నెగెటివిటీ ఏర్పడిన ట్రైలర్ కు మాత్రం సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుంది. కేవలం టాలీవుడ్ ఆడియన్స్ కాదు.. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులంతా.. ఈ హారర్ రొమాంటిక్ సీన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ ట్రైలర్.. యూట్యూబ్లో రిలీజ్ అయిన కేవలం 18 గంటల్లో.. 40 మిలియన్లకు పైగా వ్యూస్ ను దక్కించుకుంది. అంటే.. ఇండియన్ కౌంట్ ప్రకారం నాలుగు కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇది గంట గంటకు పెరుగుతూ ఉండడం విశేషం. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. రాయల్ బ్లాస్ట్ అంటూ పేర్కొన్న మేకర్స్.. ఎంత చూసినా సరిపోదంటూ ట్యాగ్ చేశారు. అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ఇదే రెంట్లో రెస్పాన్స్ దక్కుతుండటం విశేషం. నాలుగు మిలియన్‌లకు పైగా డిజిటల్ వ్యూస్ దాటడం.. ఒక క్రేజీ రికార్డు అయితే.. తెలుగు ట్రైలర్ కంటే హిందీ ట్రైలర్ కు ఎక్కువ వ్యూస్ రావడం మరింత బిగ్ మేటర్.