టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమెజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. కెరీర్ లో వరుస సక్సెస్ లను అందుకుంటూ రాణిస్తున్నాడు. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమాలతో సంచలనం సృష్టించి.. కేవలం టాలీవుడ్ ఆడియన్స్‌కే కాదు.. ఇండియా వైడ్‌గా తన సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్‌లోను విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబును హీరోగా పెట్టి.. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను తలెత్తుకునేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇది ఒక రకంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆనందాన్ని కలిగించే విషయమే అయినా.. రాజమౌళి ఈ విషయంలో టాలీవుడ్‌కు హీరో గానే నిలిచిన.. ఓ విధంగా మాత్రం ఇండస్ట్రీకి పెద్ద లోటును తెచ్చిపెట్టాడు. అసలు మ్యాటర్ ఏంటంటే.. భారీ బడ్జెట్‌తో పెద్దపెద్ద సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి.. సక్సెస్ అందుకుంటూ టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన క్రమంలోనే.. చిన్న సినిమాల ఆదరణను దూరం చేశాడు. పెద్ద పెద్ద సినిమాలో వచ్చినప్పుడు థియేటర్లోకి వెళ్లి చూసుకోవచ్చులే అని ఆడియన్స్.. చిన్న సినిమాలను చూడడం పై ఆశక్తి చూపడం లేదు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలో ప్రొడ్యూసర్లకు భారీ నష్టం చేకూరుతుందని.. ఈ విషయంలో రాజమౌళి చాలా బిగ్ మిస్టేక్ చేసాడంటూ విమర్శలు ఎదురవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీని ఎల్లలు దాటించి.. ముందుకు తీసుకెళ్లడంలో హీరో అనిపించుకున్న జక్కన్న.. చిన్న నిర్మాతలకు అన్యాయం చేసి విలన్ గా మారాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి చిన్న నిర్మాతలైనా సరే ఎంచుకున్న కంటెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచి రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.. అంతే తప్ప చిన్న బడ్జెట్ కదా అని ఎవరు సినిమాలు చూడడం మానడం లేదంటూ రాజమౌళి అభిమానుల వాదన. మంచి కంటెంట్ ఎంచుకొని సినిమాలు తీస్తే ప్రేక్షకులు డైరెక్ట్ గా ధియేటర్లకు వస్తారు.. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేసి వాళ్ళని థియేటర్లను రప్పించుకోవాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్లు, దర్శకులదే అంతేకానీ.. ఈ తప్పును రాజమౌళి పైకి నెట్టడం అసలు సరికాదు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.