యంగ్ హీరో తేజ సజ్జ నటించిన హనుమన్‌తో పాన్ ఇండియా లెవెల్ లో సంచలనంగా మారాడు ప్రశాంత్ వర్మ. రూ.30 కోట్ల బడ్జెట్లో వచ్చిన ఈ మూవీ ఏకంగా రూ.340 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి.. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దెబ్బతో ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోయింది.. ఈ క్రమంలోనే ఆయనతో సినిమాలు చేసేందుకు.. స్టార్ హీరోలు సైతం ముందుకొచ్చారు. నిర్మాతలు సైతం అడ్వాన్సులు కుమ్మరించి మరీ సినిమాల కోసం క్యూ కట్టారు. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ వర్మ కూడా వరుస ప్రాజెక్టుతో తెగ హడావిడి చేశాడు. కానీ హనుమాన్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటివరకు ఆయన అనౌన్స్ చేసిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు సరి కథ.. అనైన్స్ చేసిన సినిమాలపై కూడా నో అప్డేట్. ఇంతకీ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఏ సినిమా చేస్తున్నాడు..? ఏ సినిమా రిలీజ్ కానుంది..?
డైరెక్టర్గా వస్తున్నాడా..? లేదా ప్రొడ్యూసర్గా వస్తున్నాడా..? అనే క్లారిటీ కూడా ఆడియన్స్ కు ఇవ్వడం లేదు. హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ వస్తుందని అఫీషియల్ గా ప్రకటించారు. అంతేకాదు హనుమాన్ రోల్‌లో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి నటిస్తున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చినా.. తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ పై ఎలాంటి అప్డేట్ లేదు. అసలు సినిమా ఉందా.. లేదా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. అంతేకాదు ప్రొడ్యూసర్ గా మారి.. మహాకాళి సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు అఫీషియల్ గా వెల్లడించాడు. ఆ సినిమాపై కూడా నో అప్డేట్. ఇక డీవివి దానయ్య కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అధీరా అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పై కూడా ఏ క్లారిటీ లేదు. ఈ సినిమా కోసం మరో డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడని టాక్ మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇంతకీ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి కారణాలు ఏంటో తెలియదు.
ఇక ఇన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన ఒక్క సినిమాపై కూడా క్లారిటీ లేదు. ఇలాంటి క్రమంలో ఏకంగా పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక ఈ సినిమా అయితే అడ్రసే లేదు. ఇక బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డబ్బింగ్ మూవీకి డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మనే వ్యవహరించినట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. కేవలం అది ఒక సింగల్ పాస్టర్‌కే పరిమితమైంది. అసలు ఆ సినిమా ఉందా.. లేదా కూడా తెలియదు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ సింగ్‌తో బ్రహ్మ రాక్షస ప్రాజెక్ట్ అన్నారు.. అది అంతే.. ఇవన్నీ పక్కన పెడితే అసలు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఏ సినిమాపై అయినా పని చేస్తున్నాడా.. లేదా.. అసలు ఏం చేస్తున్నాడు అనేది పెద్ద చిక్కు ప్రశ్న. హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయని చెప్పుకొచ్చాడు.. దానికి తగ్గట్టుగానే ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు అనౌన్స్మెంట్ చేశాడు.. కానీ ఒక్క సినిమా విషయంలో కూడా ఇప్పటివరకు లెక్కలు తేలలేదు. అసలు ప్రశాంత్ వర్మ లైనప్ ఇప్పటికైనా క్లారిటీ ఇస్తాడా లేదో చూడాలి.