ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్టులలో పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హనురాగపూడి డైరెక్షన్లో వస్తున్న ఫౌజీ ప్రాజెక్ట్ ఒకటి. ఇప్పటికే ప్రభాస్ సినిమాలకు పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడింది అనడంలో సందేహం లేదు. ఆయన చేసే సినిమా ఏదైనా సరే.. పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో టాలీవుడ్ ఆడియన్స్ లో తెగ ట్రైండింగ్‌గా మారుతుంది. ఇక.. ఈ సినిమాకు సీతారామం ఫేమ్.. హనురాగవపూడి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన మొదటి నుంచి సెన్సిబుల్ స్టోరీలతోనే.. హృదయాలను హత్తుకునే ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ను కట్టి పడేస్తూ ఉంటాడు. అందుకే.. హనురాగపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశనికంటాయి.
ఇక సినిమాలో హీరోయిన్గా సోషల్ మీడియా పాపులర్ బ్యూటీ ఇమన్వీ మెరవనుంది. రాహుల్ రవిచంద్రన్, అనుపమ కేర్, మిధున్ చక్రవర్తి, జయప్రద లాంటి స్టార్ కాస్టింగ్ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై.. ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొంది. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ కు సంబంధించిన షాకింగ్ విషయాలు నెటింట వైరల్ గా మారుతున్నాయి. సినిమా షూటింగ్ టైంలో డైరెక్టర్ హను ప్రవర్తన కారణంగా సెట్లో కొంతమంది నటీనటులు ఇబ్బంది పడుతున్నారని వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. చిన్న విషయానికి కూడా హను అందరి పై సీరియస్ అవుతున్నాడని.. ఒకే సీను పదేపదే రీటెక్లు చేస్తూ యాక్టర్స్ కు చిరాకు తెప్పిస్తున్నాడని టాక్.
దీంతో చాలామంది సెలబ్రిటీస్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుని ఆలోచనలో కూడా ఉన్నారట. ఈ క్రమంలోనే.. మ్యాటర్ ప్రభాస్‌కు తెలియడంతో.. పర్సనల్‌గా ప్రభాస్ హనుని కలిసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకుని.. సినిమాపై డెడికేషన్, ఫ్యాషన్ చూపించు.. చిన్న విషయాలకు టీం పై చిరాకు పడితే.. మీపై అందరిలో నెగటివ్ ఫీల్ కలుగుతుంది. అందుకే మీ విధానాన్ని మార్చుకోండి.. ఒక డైరెక్టర్ పాజిటివ్ ఎనర్జీ తో సెట్ లో ఉంటే.. అందరూ హ్యాపీగా ఉంటారు. తమ రోల్ ను 100% ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడే సినిమాకు మంచి అవుట్ పుట్ వస్తుందని ప్రభాస్ సూటిగా చెప్పారట. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. ప్రజెంట్ ఈ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది.