బాలయ్య రిజెక్ట్ చేసిన కథలో పవన్ ఎంట్రీ.. కట్ చేస్తే షాకింగ్ రిజల్ట్..!

ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. కొన్ని సందర్భాల్లో కథలు నచ్చినా.. ఇతర కారణాల వల్ల కథలను వదులుకోవాల్సి వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో కథలు నచ్చక వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా నందమూరి నట‌సింహం బాలకృష్ణ సైతం తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో కథలను వదులుకున్నారు. అలా.. బాలయ్య ఇప్పటివరకు తన కెరీర్లో వదులుకున్న కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే.. మరికొన్ని ఘోరమైన డిజాస్టర్లను దక్కించుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే గతంలో బాలకృష్ణ రిజెక్ట్ చేసిన క‌థ‌ల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడంటూ టాక్‌ వైరల్ గా మారుతుంది.

Prime Video: Annavaram

ఇంతకీ ఆ మూవీ ఏంటి.. పవన్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్‌ అందుకున్నాడు.. ఒకసారి తెలుసుకుందాం. బాల‌య్య రిజెక్ట్‌ చేసిన మూవీ మరేదో కాదు.. అన్నవరం. పవన్ కళ్యాణ్ హీరోగా.. అసిన్‌ హీరోయిన్గా నటించిన ఈ సినిమా.. సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్‌తో రూపొంది.. భారీ అంచనాల న‌డుమ‌ రిలీజైంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఊహించిన రేంజ్ లో సక్సెస్ దక్కించుకోలేకపోయింది. అయినా.. పవన్ నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసల దక్కాయి. పవన్‌ అభిమానుల సైతం ఇప్పటికీ చాలామంది ఈ సినిమాని ఇష్టపడుతుంటారు.

అయితే.. గతంలో ఈ సినిమాను బాలకృష్ణతో చేయాలని మేకర్స్ భావించారట. ఈ క్రమంలోనే.. బాలకృష్ణకు వెళ్లి కథ కూడా వినిపించారట. కాని.. బాలకృష్ణ ఏవో కారణాలతో సినిమా నటించలేనని చెప్పేసాడట. దీంతో.. మేకర్స్‌ చేసేదేవి లేక.. పవన్ కళ్యాణ్‌తో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇప్పించుకున్నాడు. అలా.. బాలయ్య రిజెక్ట్ చేసిన మూవీలో పవన్ హీరోగా నటించి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అందుకోకపోయినా.. నటనకు మాత్రం విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకున్నాడు.