పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌లో ఇప్పటికే పీక్స్ లెవెల్లో అంచనాలు పెంచేసింది. సుజిత్ వాస్తవానికి ఫ్లాప్ డైరెక్టర్ అయిన.. ఓ గ్యాంగ్స్టర్ బ్లాక్ డ్రాప్‌తో రూపొందిస్తున్న సినిమా కావడం.. అది కూడా పవన్ కళ్యాణ్ హీరో కావడంతో.. ఈ సినిమాపై మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక రెండేళ్ల క్రితం సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ఆడియన్స్ లో అంచనాలు ఆకాశానికి అంటాయి. ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ సైతం ఆసక్తి చూపుతున్నారు. ఇక.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ సైతం.. ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.
ఈ నెల 25న సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానున్న క్రమంలో.. మెల్లమెల్లగా సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు టీం. ముఖ్యంగా.. సినిమాలో పవన్ లుక్స్ ను ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఎపి డిప్యూటీ సీఎంగా బిజీగా గడుపుతున్న పవన్.. టైం దొరికినప్పుడల్లా షూటింగ్స్ లో ఫుల్ బిజీబిజీగా గడిపెస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హరిహర వీరమల్లుతో ఆడియన్స్‌ను పలకరించి.. ఈ సినిమాతో యావరేజ్ టాక్‌ను దక్కించుకున్నాడు. నెక్స్ట్ ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లతో మాత్రం సాలిడ్ హిట్లు కొడతాడు అనే నమ్మకం ఫాన్స్ లో మొదలైంది. కాగా.. నేడు పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా కొద్దిసేపటి క్రితం ఓజి నుంచి పవన్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. ప్రతిష్టాత్మకంగగా నిర్మిస్తున్న.. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇక పవన్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో ప్రేక్షకులను నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంటుంది. ఇమ్రాన్ హష్మీ ఎంట్రీతో టీజర్ మొదలు కాగా.. ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ తో ఇమ్రాన్ పవర్ఫుల్ విలన్‌గా మెరిశాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం ఆకట్టుకుంది. టీజర్‌లో ఆయన చెప్పిన ఏకెక డైలాడ్ హ్యాపీ బర్త్డే ఓజి. ఈ డైలాగ్‌తో పవనఖ ఎంట్రీ ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. 25 సెప్టెంబర్ 2025 ని సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ మరోసారి అఫీషియల్ గా టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే టీజర్ పై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ రికార్డ్స్ బ్లాస్ట్ పక్కా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.