టాలీవుడ్ స్టార్ యాక్టర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం రేణు దేశాయ్ ఏ సినిమాలు చేయట్లేదు. అయితే.. చివరిసారిగా మాస్ మహారాజు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో మెరిసిన ఈ అమ్మడు.. తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించినా.. పిల్లలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ను అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా వన్యప్రాణుల విషయంలో ఏదైనా తప్పు జరిగినా.. ఎవరైనా హింసిస్తున్నా.. దానిపై రియాక్ట్ అవుతూ వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో తాజాగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకరు చేసిన కామెంట్‌కు రేణు దేశాయ్ రెస్పాన్స్ అందరినీ ఆకట్టుకుంది. మీ పక్కన పవన్ కళ్యాణ్ తప్ప మరొకరిని ఊహించుకోలేము అని అభిమాని తన ఇన్‌స్టా వేదికగా కామెంట్ చేశారు. ఇది చూసిన రేణు దేశాయ్.. ఓ లాంగ్ పోస్టుతో అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
తన ఇన్స్టాల్ ఆమె.. ఈ అబ్బాయి/అమ్మాయి కొంతవరకు చదువుకున్న వారిలాగే ఉన్నారు.. అందుకే స్మార్ట్‌ఫోన్‌లో.. తన సొంత ఈమెయిల్ క్రియేట్ చేసి.. నా పోస్ట్ పై కామెంట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరిచినట్లు ఉన్నాడు. మనందరం ఇప్పుడు 2025 లో ఉన్నాం. ఇప్పటికీ పితృసౌమ్యం చాలామందిలో పాతుకు పోయిందంటూ చెప్పుకొచ్చింది. నేటికి ఎంతోమంది ప్రజలు.. ఒక స్త్రీకి స్వేచ్ఛ, సంకల్పం లేకుండా కేవలం తండ్రి లేదా భర్త అస్తిత్వాన్ని నమ్ముతున్నారు. నేటికి మహిళలకు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి వేరొకరి అనుమతి కావాల్సి ఉంటుంది. ఇప్పటికీ స్త్రీ ఇష్టాని.. కేవలం అందరికీ వంట చేయడం, పిల్లలకు జన్మనివ్వడానికి వంటగదికే అంకితం అని భావిస్తున్నారు. నేను ఇలాంటి మనస్తత్వానికి వ్యతిరేకంగా ఉంటా. నా ఘళం వినిపించడానికి నా ఫ్రెండ్స్.. అలాగే నా చుట్టూ ఉండే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అని భయపడడానికి నేను ఇష్టపడనంటూ వివరించింది.
నెక్స్ట్ జనరేషన్ మహిళల.. మార్గం సులువు చేయడానికి ఒక మహిళగా, ఒక ఆడపిల్ల తల్లిగా నా వంతు కృషి చేస్తానంటూ చెప్పుకొచ్చింది. స్త్రీవాదమంటే వీకెండ్స్ లో తాగి ఎంజాయ్ చేయడం కాదు.. మహిళలను పశువులు, ఫర్నిచర్‌లా చూసే ప్రాథమిక మనస్తత్వం ఉన్న మూలాలను గట్టిగా ప్రశ్నించడం.. రాబోయే కొద్ది తరాల్లోనే స్త్రీలు ప్రపంచం మొత్తంలో తమదైన.. ఉన్నత స్థాయిని కనుగొనడాని.. చూస్తాం. తల్లి గర్భంలో స్త్రీగా జన్మనిచ్చినందుకు పరువు హత్యలు, వరకట్నం మరణాల కోసం ఒకరి చేతిలో చంపబడరని కోరుకుంటున్న అంటూ తాను కామెంట్ చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన కామెంట్ కు ఆమె రెస్పాన్స్ అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తనదైన స్టైల్ లో రేణు సరిగ్గా సమాధానం చెప్పిందని.. ఆడదంటే ఒక మగాడి పక్కన ఉండి అతని ఆసరా తో మాత్రమే బ్రతకుతుందని ఆలోచన చేసే వాళ్ళందరికీ.. ఇది సరైన సమాధానం అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్.
View this post on Instagram