పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 5వ1 పుట్టిన రోజు కావడంతో.. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా గ్రాండ్ లెవెల్లో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్‌ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మరో పక్క.. రాజకీయ సినీ ప్రముఖల నుంచి సైతం సోషల్ మీడియా వేదికగా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఎన్నోచోట్ల కేక్ కటింగ్, స్వీట్స్, సేవా కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు అభిమానులు. రక్తదాన శిబిరాలను సైతం నిర్వహిస్తూ ఆయనకు శుభం కలగాలని కోరుకుంటున్నారు. అలా.. ఇప్పటికే ఆయన బర్త్డే విషెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మొదలుకొని.. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, శృతిహాసన్ ఇలా ఎంతోమంది విషెస్ తెలియజేశారు.
టాలీవుడ్‌కు చెందిన దర్శక, నిర్మాతలు, టెక్నీషియన్లు ఆయనకు గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. ఇలాంటి క్రమంలో పవన్ పుట్టినరోజు నాడే వివాదంలో చెప్పుకున్నాడు. దానికి కారణం ఓ ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీ పై రాసిన కొటేషన్స్ అభ్యంతరంగా ఉన్నాయని వివాదం మొదలైంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. కోనసీమ జిల్లా సహా.. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కు చెందిన కాపు సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉన్న క్రమంలో.. ఆ జిల్లాల్లో జనసేన కంచుకోటలా మారింది. కాగా కోనసీమ జిల్లాలో ఫ్యాన్స్ పవన్‌కు విష్ చేస్తు పెట్టిన ఓ పోస్టర్.. దానిలో ఓ డైలాగ్..మీరంతా.. మీ స్థాయి ఎంత.. రోడ్లమీద పడేస్తాం కొడకల్లారా అని రాసి ఉండడం ఇప్పుడు అందరికీ షాక్ కలిగించింది.
పవన్ కళ్యాణ్ భారీ ఫోటో.. మరో వైపు త్వరలో రిలీజ్ కానున్న ఓజీ టైటిల్ ప్రింట్ చేశారు. ఈ కొటేషన్ పట్ల దళిత సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. బ్యానర్ను తొలగించాలని మొండి పట్టు పట్టాయి. ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా.. అవమానించేలా.. ఈ బ్యానర్ను ఏర్పాటు చేశారని.. వారిని కచ్చితంగా అరెస్ట్ చేయాలంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దళిత సంఘాల నాయకులు వినిపించుకోకుండా ఆ బ్యానర్ను చించి పడేసారు. మరి ముందు ముందు ఈ వివాదం మరింత ముదురుతుందా.. లేక పోలీస్ జోక్యంతో సద్దుమడుగుతుందో చూడాలి.