బాలయ్య నుండి పార్టీ సాంగ్.. అఖండ 2 బ్లాస్టింగ్ అప్డేట్..!

టాలీవుడ్ నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ వరుస బ్లాక్ బ‌స్టర్‌ల‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. బోయపాటి శ్రీ‌ను డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా అఖండ లాంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా మేక‌ర్స్ ప్రకటించినా.. కొన్ని కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఇప్పటికే సినిమా షూట్ తుది ద‌శ‌కు చేరుకున్నట్లు సమాచారం.

Akhanda 2 Teaser OUT: Netizens Praise Nandamuri Balakrishna, Boyapati  Sreenu's Deadly Combo, Call Glimpse 'Mass Thandavam' | Telugu - Times Now

తాజాగా.. బాలయ్య తన పాత్ర డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసేశాడు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా బాలయ్య ప్రకటించారు. డబ్బింగ్ స్టూడియోలో తీసిన ఓ సాంగ్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇక బాలయ్య ఇచ్చిన‌ తాజా అప్డేట్ ప్రకారం ఓ పార్టీ సాంగ్ రూపోందిస్తున్నారు. ఈ సాంగ్ షూట్ హైదరాబాద్లో గ్రాండ్ గా ఏర్పాటు చేసిన.. స్పెషల్ సెట్ లో జరుగుతుంది. ఈ సాంగ్ కంప్లీట్ అయిన వెంటనే సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తిచేసి.. కొత్త రిలీజ్ డేట్ సిద్ధం చేస్తారని సమాచారం.

ఇక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కుతున్న క్రమంలోనే.. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్, ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాల్లో.. రాజకీయ అంశాలతో పాటు.. సాంఘిక అంశాలు కూడా ఉంటాయని టాక్. భారీ సెట్లు, విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయట. ఇప్పటికే షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు.. అఫీషియల్ రిలీజ్ డేట్ ను త్వరలోనే మేకర్స్‌ వెల్లడించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న క్రమంలో.. బాలయ్య మార్క్‌ మాస్ మ్యాన‌ర్‌ అఖండ 2తో తెరపై చూడడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా రిలీజై.. ఎలాంటి టాక్ ద‌క్కించుకుంటుందో చూడాలి.