నందమూరి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలోనూ, రాజకీయంలోనూ రాణించి మంచి పేరును సంపాదించుకున్న వారిలో దివంగత హరికృష్ణ ఒకరు. 2018 ఆగస్టు 30న హరికృష్ణ నల్గొండ జిల్లా అనపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లాలో అభిమాని వివాహానికి వెళ్ళొస్తుండగా ఈ ఈ విషాదం చోటుచేసుకుంది. ఆయన అకాల మరణం ఫ్యాన్స్ అసలు తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ దానిని జర్ణించుకోలేకపోతున్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఎంతోమంది అభిమానులు ప్రార్థిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే నేడు ఆయన 69వ జయంతిని పురస్కరించుకుంటూ ఆయన తనయుడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు. తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకున్నాడు. తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని అక్షర రూపంలో వివరించాడు. ఎన్టీఆర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వమే మీరు.. ఆజన్మంతం తలుచుకునే అశ్రుఖనం మీరు.. అంటూ గాడమైన కవిత్వ రూపంలో తండ్రి పై ఉన్న ప్రేమానురాగాలను, ఆయనపై ఉన్న అభిమానాన్ని చూపించాడు తారక్.
ఈ పదాలు ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రతిభింబిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పోస్ట్ పై స్పందిస్తూ హరికృష్ణ ను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. చివరిగా వార్ 2తో బాలీవుడ్ డబ్యు ఇచ్చిన తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా మెరవనుంది. ప్రస్తుతం షూట్ శరవేగంగా జరుపుకుంటున్న టీం.. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.