” OG ” బెనిఫిట్ షోస్ బుకింగ్స్ ఓపెన్.. రూ. 1000 టికెట్ రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవెంటెడ్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్‌లో సైతం.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్ర‌మంలోనే.. ఇప్పటివరకు సినిమా బుకింగ్స్ ఓవర్సీస్‌లో ప్రారంభమై రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మరో వారం రోజుల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న‌ ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రధాన నగరాల్లో ప్రీమియర్స్, బెనిఫిట్స్ సైతం వేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

Pawan Kalyan's 'They Call Him OG' tickets to be sold at ₹1,000 for special  show in Andhra Pradesh - CNBC TV18

ఇప్పటికే ఆంధ్రలో ఈ బెనిఫిట్లకు సంబంధించిన పర్మిషన్స్ కూడా వచ్చేసాయి. ఓజి బెనిఫిట్ షో బుకింగ్స్ గుంటూరు, లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో ఉన్న హాలీవుడ్, బాలీవుడ్ థియేటర్స్ లో.. శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ థియేటర్లో ఓజి సినిమా మిడ్ నైట్ షో టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్ వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచారు. అయితే.. టికెట్ కాస్ట్ ₹1000 అని జీవోలో క్లియర్గా గావ‌ర్మెంట్ మెన్షన్ చేసింది. ఈ క్రమంలోనే బుకింగ్ ఛార్జ్‌, జిఎస్టి అన్నింటినీ కలుపుకొని టికెట్లు రూ.1042కు డిస్టిక్ట్ సేల్ చేస్తుంది. ఇక పవన్‌ అభిమానులు.. టికెట్ రేటు ₹1000 ఉన్న ఎక్కడ టికెట్లు ద‌క్కించుకోవడానికి అసలు వెనుకడుగు వేయడం లేదు.

OG: AP government approves massive ticket rate hikes & benefit shows

ఇక మేకర్స్‌ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. సినిమా టికెట్ రేట్ లపై స్పష్టత వచ్చేసింది. బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాచి. ఇక తెలంగాణ ప్రీమియ‌ర్‌ షోస్ విషయంలో మాత్రం సస్పెన్స్. టికెట్ ధరల పెంపు ఉంటుందా లేదా.. బెనిఫిట్ షోల‌కు ప‌రిమిష‌న్స్ వ‌స్తాయా అనేది క్లారిటీ లేదు. ఇప్పటివరకు పుష్ప 2 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏ సినిమాకు ప్రీవియర్‌, బెనిఫిట్ షోల‌కు అనుమతులు ఇవ్వలేదు. ఒకవేళ ఓజి సినిమాకు పర్మిషన్స్ ఇస్తే మాత్రం.. పుష్ప 2 బెనిఫిట్ షోలను మించిపోయి.. రేంజ్‌లోకి ఓజి సంద‌డి ఉంటుందని డిస్కషన్ సినీ వర్గాల్లో మొదలైంది.