నందమూరి నటసింహం బాలకృష్ణ.. టాలీవుడ్లో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ బ్లాక్ బస్టర్‌కు సీక్వల్‌గా అఖండ 2 సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఫిక్స్ చేశాడట.
వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. బాలయ్య మరోసారి డైరెక్టర్ గోపీచంద్ మల్లినెనితో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. NBK 111 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్న ఈ సినిమా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక సినిమాను దసరా సెలబ్రేషన్స్‌లో భాగంగా.. గ్రాండ్ లెవెల్‌లో ప్రారంభించడానికి టీం సిద్ధమైనట్లు తెలుస్తోంది. చరిత్రను, భారీ యాక్షన్‌ను ముడిపెట్టి.. ఓ వినూత్నమైన ఎపిక్ కథతో సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం.
ఇందులో బాలయ్య మునుపెన్నడూ చూడని ఒక పవర్ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. ఇక ఈ సినిమాతో పాటే.. బాలకృష్ణ మరో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితోను సినిమా చేసేందుకు అంత సిద్ధం చేస్తున్నారు. దీనిపై కూడా దసరా రోజే క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులను ఒకేసారి సెట్స్‌పైకి తీసుకువెళ్లి సమాంతరంగా షూట్ చేయనున్నట్లు సమాచారం.