టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లేటెస్ట్‌గా నటించిన మూవీ మీరాయ్. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానున్న క్రమంలో ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు టీం. ఇందులో భాగంగానే తాజాగా కార్తీక్ ఘట్టమనేని శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్ట్ విషయాలను పంచుకున్నాడు. అసలు మీరాయ్ కథ ఎలా మొదలైందో వివరించిన ఆయన.. ఈ కథను భారీ లెవెల్లో తీయాలని ముందే అనుకున్నారా అనే ప్రశ్నకు ఆరేళ్ల క్రితం మొదలైన ఆలోచన ఇది అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఈ కథని మన ఇతిహాసాలతో ముడిపెడుతూ స్క్రిప్ట్ రాయడానికి చాలా టైం పట్టిందని.. ఇలా తీస్తానని నేను కూడా అనుకోలేదు.. కానీ విజువల్ గా మాత్రం చాలా గ్రాండ్గా అనిపించింది.. ఇక ఈ ఆలోచన ముందు నుంచి ఉన్నదే.. మూడు ఏళ్ల క్రితమే షూట్‌ను ప్రారంభించాం.. అయితే సినిమాకు కాస్త ఎక్కువ సమయం పట్టిన దానికి తగ్గట్లుగానే సినిమాను చూపిస్తామంటూ వివరించాడు. ఇక సినిమాలో డైరెక్టర్ గా మీకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనే ప్రశ్నకు రియాక్ట్ అవుతూ పెద్ద డ్రీమ్ టార్గెట్ ఫిక్స్ చేసుకొని రంగంలోకి వచ్చాం కానీ.. ప్రయాణం ఎలా తుది దశకు చేరుకుంటుందో మాకు తెలియదు. బయటికి ఎప్పుడూ స్ట్రాంగ్ గా కనిపించే వాడిని కానీ.. నేను అనుకున్నట్లు ప్రతి సీన్ వస్తుందా.. లేదా.. అనే భయం ఎప్పుడు ఉండేది.
శ్రీలంకలో తీసిన ట్రైన్ సీక్వెన్స్ చేయడానికి వెళ్లేటప్పుడు అయితే మరి కాస్త భయం పెరిగింది. కానీ.. మాకు ఆ దైవ శక్తి తోడు ఉందనుకుంటున్నా. ప్రతి సినిమా అంచనాలకు మించిపోయేలా వచ్చింది. ఏ సంబంధం లేని చాలామంది మనుషులు మాకు ఈ సినిమా కోసం సహాయం అందించారు. అందుకే.. ట్రైలర్‌లో కూడా ఎక్స్పీరియన్స్ పవర్ ఆఫ్ బ్రహ్మాండ అనే ట్యాగ్ను పెట్టాం.. మంచు పర్వతాలు, ఎడారులో, అడవుల్లో షూట్.. వంద రోజులకు పైగా చేస్తే.. దాదాపు 70 రోజులు సెట్ లో ఒక్క క్యారవాన్ కూడా లేకుండా షూట్ కంప్లీట్ చేసాం. అంత పెద్ద సెలబ్రిటీలు సినిమాలో ఉన్న క్యారవాన్ లేకున్న.. అడ్జస్ట్ అయ్యి మరి సినిమా చేసి వెళ్లారు. అలా సినిమాకు అన్ని కుదిరాయ్ అంటూ వివరించాడు.