మీరాయ్‌ పార్ట్ 2 టైటిల్ లీక్.. విలన్ గా ఆ పాన్ ఇండియన్ స్టార్ హీరో..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్‌ బ్లాక్ బస్టర్ కొట్టి తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ మీరాయ్‌. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమాలో తేజ ఓ యోధుడిగా మంచి మనసున్న వ్య‌క్తిగా , మంచు మ‌నోజ్ ఓ పవర్ఫుల్ విలన్ గా మెరిశారు.

ఇక రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ టాక్ దక్కించుకుంది. సుపర్ యోధా తేజ నటన అదిరిపోయింది అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా క్లైమాక్స్లో మీరాయ్‌ 2 ఉందని ప్రకటించారు. ఇక మీరాయ్ 2 టైటిల్ మీరాయ్ జైత్ర‌యా.. అని రివిల్ చేసారు. అలాగే ఈ సీక్వెల్ లో విలన్ గా పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోదగ్గుపాటి రానా కనిపించనున్నాడు. ఇక ఈ సీక్వెల్ ఎప్పుడు తీసుకొస్తారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Baahubali' Star Rana Daggubati Will Foster Indies at Mumbai Film Fest

ఇక నెక్స్ట్‌..తేజ సజ్జ హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్‌లో తేజా బిజీ అవుతాడని టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో కనిపించేది కొంతసేపే అయినా.. తన పాత్ర చాలా కీలకంగా ఉండనుందని సమాచారం. అలాగే.. జాంబిరెడ్డి మూవీ సీక్వెల్‌గా జాంబిరెడ్డి 2ను కూడా తాజాగా ప్రకటించారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియాని తెరకెక్కిస్తుంది. ముందు జై హనుమాన్, జంబిరెడ్డి సీక్వెల్స్ ను పూర్తిచేసి తర్వాత మీరాయ్‌ పార్ట్ 2 సెట్స్‌లోకి అడుగు పెడతాడట.