టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మిరాయ్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్‌లో మరింత అంచనాలను పెంచేసింది. రితికా నాయక్ హీరోయిన్‌గా.. మంచు మనోజ్ విలన్ పాత్రలో.. జగపతిబాబు, శ్రియ శరన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్‌లో మేకర్స్‌కు కనక వర్షం కురిపిస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. ఐదు రోజుల కలెక్షన్లతో సరికొత్త రికార్డును బ్రేక్ చేసిందని.. మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. తాజాగా.. సినిమా రూ.100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయిపోయిందంటూ తమ ఆనందాన్ని వెల్లడించారు. థియేటర్లు ఓపెనింగ్ డే నుంచే.. బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుకుంటున్న మిరాయ్.. వీకెండ్ తర్వాత కూడా.. కలెక్షన్లు డ్రాప్ లేకుండా స్టడీగా కొనసాగుతుందని.
సినిమాలో కంటెంట్ ఉంటే అది ఎంత చిన్న సినిమా అయినా.. సునామీ సృష్టించడం ఖాయమని.. మిరాయ్ మరోసారి ప్రూవ్ చేసింది. ఇక.. ఓవర్సీస్ నుంచి సైతం సినిమాకు మంచి వసూళ్లు దక్కుతున్నాయి. నార్త్ అమెరికాలో ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను సొంతం చేసుకోగా.. వీకెండ్ తర్వాత అక్కడ కూడా కలెక్షన్లు బాగా పెరిగాయి. ఇదే జోరు కొనసాగితే.. పవన్ ఓజీ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి సినిమా రూ.200 కోట్ల రికార్డులు కూడా బ్రేక్ చేసి సంచలనం సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.