టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర, మన శంకర వరప్రసాద్ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న.. మన శంకర వరప్రసాద్ గారు.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక విశ్వంభర సినిమా ఇప్పటికే షూట్ ముగించుకొని.. విఎఫ్ఎక్స్, ఇతర పనులలో మేకర్స్ బిజిగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కు మరింత ఆలస్యం అవుతుందని.. వచ్చే ఏడాది సమర్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.
కాగా.. చిరు ఈ రెండు సినిమాల పనులు పూర్తవకముందే.. మెగా 158 ప్రాజెక్ట్‌కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశాడట. తన కొత్త సినిమాకు శ్రీకారం చుట్టడానికి దసరా పర్వదినాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే.. అక్టోబర్ 2 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. బాబి కొల్లి డైరెక్షన్‌లో చిరంజీవి సినిమాలో నటించనున్నాడు. ఇక ఇటీవల జరిగిన చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.
వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. ఈ క్రమంలోనే.. అభిమానుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను రూపొందించనున్నారు. కేవీఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్‌లో ఆడియన్స్‌ను పలకరించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.