టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగనాథ్ కాంబో అంటే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మహేష్ కు ఏకంగా రెండు బ్లాక్ బాస్టర్ సక్సెస్ లు ఇచ్చాడు పూరీ. ఇంకా చెప్పాలంటే.. పోకిరితో ఇండస్ట్రియల్ హిట్ అందించాడు. ఈ మూవీ అప్పటివరకు ఉన్న అన్ని సినిమాల టాలీవుడ్ రికార్డును బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే పోకిరి మూవీ కలెక్షన్ల ఎఫెక్ట్ ఇతర సినిమాలపై చాలా కాలం పాటు కొనసాగింది. ఆ తర్వాత మళ్లీ వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన మూవీ బిజినెస్‌మాన్.. పోకిరి అంత హిట్ కాకపోయినా ఓ మాదిరిగా ఆడియన్స్‌ను మెప్పించింది. కమర్షియల్ గా ఆకట్టుకుని సక్సెస్ అందుకుంది.
అయితే.. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ తర్వాత.. మహేష్‌తో పూరి అనుకున్న మూవీ జనగణమన. ఈ సినిమాను ఆల్మోస్ట్ ఫిక్సై.. అనౌన్స్మెంట్ దాకా వచ్చిన తర్వాత కారణం తెలియదు కానీ.. సడన్‌గా ఆపేశారు. కాగా.. గతంలో పూరి జగన్నాథ్ మహేష్ తో కలిసి చేయాల్సిన జనగణమన సినిమా గురించి.. ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇస్మార్ట్ శంకర్ మూవీ రిలీజ్ టైం లో పూరి జగన్నాథ్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ ఓన్లీ సక్సెస్‌లో ఉన్న డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తాడని.. అందుకే నాతో సినిమాలు చేయటం లేదంటూ చెప్పుకొచ్చాడు. మహేష్ ఫ్యాన్స్ తనని బాగా ఇష్టపడతారని.. ఇప్పటికీ టచ్ లోనే ఉంటారని.. అన్నా మహేష్‌తో సినిమా చేయాలని అడుగుతారని.. జనగణమన సినిమా చేయమని ఇప్పటికే చాలాసార్లు రిక్వెస్ట్ చేశారని.. నాపై ఎంతో ప్రేమ చూపిస్తారు అంటూ వివరించాడు.
అందుకే నాకు మహేష్ కన్నా.. ఆయన ఫ్యాన్స్ అంటేనే ఎక్కువ ఇష్టమంటూ చెప్పుకొచ్చాడు పూరి. ఇక అదే ఇంటర్వ్యూలో ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిన తర్వాత.. మహేష్ బాబు సినిమా చేద్దామంటే మీరు చేయడానికి రెడీనా అని యాంకర్ ప్రశ్నించగా.. నేను చేయను.. పూరికి కూడా ఓ యాటిట్యూడ్ ఉంటుంది కదా అంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పూరి మళ్లీ మహేష్ తో సినిమా చేయాలని కూడా అనుకోలేదట. ఈ క్రమంలోనే తన ఆలోచన చాలా మంచిదంటూ.. పలువురు నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పూరి చేసిన ఈ కామెంట్స్ వల్లే తర్వాత మహేష్ బాబు మహర్షి సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ అందరి డైరెక్టర్ల పేర్లను చెప్పాడు. కానీ.. పూరి పేరును స్కిప్ చేశాడని టాక్ కూడా నడిచింది.