” లిటిల్ హార్ట్స్ ” మూవీ రివ్యూ.. ఆడియన్స్ కు నవ్వుల పండగే..!

యంగ్ న‌టుడు మౌళి తనూజ్‌, శివాని నాగారం జంటగా నటించిన లేటెస్ట్ మూవీ లిటిల్ హార్ట్స్‌. స‌సాయి మార్తాండ్‌ డైరెక్షన్‌లో ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. స‌త్యా హాసన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న (నేడు) గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ లో.. నిర్మాత బన్నీ వాస్, వంశీ నందిపాటి కూడా భాగమయ్యారు. ఈ క్రమంలోనే సినిమా రెండు రోజుల క్రితమే ప్రీమియర్స్ ని ప్రారంభించారు. ఇక సినిమాతో ఈ యంగ్ హీరో మెప్పించాడా.. సినిమా ఆక‌ట్టుకుందా లేదా చూద్దాం.

“Little Hearts” trailer impresses with hilarious fun, film set for a grand theatrical release on September 5 th - Social News XYZ

స్టోరీ:
2015 బ్యాక్ డ్రాప్ లో కథ న‌డిచింది. అఖిల్ (మౌళి)ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలని.. వాళ్ళ నాన్న గోపాలరావు (రాజీవ్ కనకాల) తాపత్ర పడుతూ ఉంటాడు. కానీ.. అఖిల్ కి చదువు ఇష్టం ఉండదు. ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తాడు. ఇలాంటి క్రమంలో ఎంసెట్ ఫెయిల్ అవ్వడం.. అప్పుడే లవర్ కూడా బ్రేకప్ చెప్పడం.. అకిల్‌కు నచ్చకపోయినా.. బీటెక్ చదవాల్సిందేన‌ని.. తండ్రి బలవంతంగా లాంగ్ టర్మ్ కోచింగ్ లో జాయిన్ చేయడం.. ఇలా వరుస పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక.. ఆ కోచింగ్ సెంటర్‌లోనే కాత్యాయని(శివాని)తో పరిచయం జరుగుతుంది. తనకి బైపిసి ఇష్టం లేకుండా వాళ్ళ పేరెంట్స్ వల్ల ఆమె కూడా కోచింగ్ తీసుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఏర్పడడం.. ఇలాంటి టైంలో కాత్యాయని బావ అని.. మరో కుర్రాడు కోచింగ్ లో జాయిన్ అవ్వడం జరుగుతుంది.

ఇక అఖిల్, కాత్యాయని మధ్య క్లోజ్నెస్ పెరగడంతో తనకి అఖిల్ ప్రపోజ్ చేస్తాడు. అయితే.. కాత్యాయని.. అఖిల్‌ను చెంపపై కొట్టి.. నీకంటే నేను మూడేళ్లు పెద్దదానిని అంటూ వెళ్ళిపోతుంది. మరి అఖిల్ అప్పుడు ఏం చేశాడు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టిందా.. లేదా..? ప్రేమకు వచ్చిన‌ చిక్కులేమిటి..? ఇంతకీ వీళ్ళు చదువుకునే చదువు ఇష్టం లేదని.. కెరీర్ గురించి ఫ్యామిలీకి అసలు చెప్తారా.. లేదా..? స్ట్రిక్ట్ పేరెంట్స్ మధ్య వీళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది..? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Little Hearts Telugu Movie Review and Rating, Mouli

రివ్యూ:
మౌళి హీరోగా ఎంట్రీ ఇచ్చిన‌ మొట్టమొదటి సినిమా లిటిల్ హార్ట్స్. ఇక మొదట సోషల్ మీడియా రీల్స్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న మౌళి.. తర్వాత 90స్ కిడ్స్‌ వెబ్ సిరీస్ తో మంచి ఇమేజ్ను తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే లిటిల్ హార్ట్స్ లో ఛాన్స్ కొట్టేశాడు. సినిమా ప్రమోషన్స్ వైవిద్యంగా ఉండడం, సాంగ్స్ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో.. సినిమాపై హైప్ పెరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా ఓ ఇంటర్మీడియట్ అయిపోయిన కుర్రాడు, అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎంసెట్ కోచింగ్ లో జాయిన్ కావడం అక్క‌డ అమ్మ‌యితో ప‌రిచ‌యం.. ఇలా అంత సాదాసీదాగా జరిగిపోతోంది. అక్కడక్కడ కామెడీ కనిపిస్తుంది. ఇంటర్వెల్ కి కాత్యాయని.. అఖిల్ కంటే 3 ఏళ్లో పెద్దదని తెలియడంతో ఆడియన్స్‌లొఓ నెక్స్ట్ వీళ్ళ ప్రేమ ఎలా కొనసాగుతుందని ఆసక్తి మొదలవుతుంది.

సెకండ్ హాఫ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో కడుపుబ్బ నవ్విస్తూ.. కాస్త ఎమోషన్స్ జోడించారు. కానీ.. ఆ ఎమోషన్ లోను, సాంగ్స్ లో సైతం ఆడియన్స్‌ను నవ్వించారు. ఇక సినిమాకు క్లైమాక్స్ మరింత హైలెట్ గా మారింది. సినిమా అంతా నడిచిన తీరు మధ్యలోనే ఎండ్ అవుతుందేమో అనిపిస్తుంది. కానీ.. కథ‌కు ఒక ఫుల్ ఫీల్ క్లైమాక్స్ అందించాడు డైరెక్టర్. చాలా కన్వెనసింగ్‌గా క్లైమాక్స్ ఉంది. స్టోరీ సాధారణమైన లవ్ స్టోరీ అయినా.. ఆడియన్స్‌లో అందరికీ కనెక్ట్ అయ్యేలా క్యూట్గా నవ్విస్తూ.. డైలాగ్స్, మంచి స్క్రీన్ ప్లే తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందించారు. సినిమా లిటిల్ హ‌ర్ట్స్‌ అనే పేరు ఎందుకు పెట్టారు అర్థం కాదు. ఇక‌ ఆ టైటిల్ కోసమే ఓ రెండు డైలాగ్స్ మాత్రం ఉంచారు.

Little Hearts Movie Release Date Announced

2015 బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన సినిమా కావడంతో.. 90స్‌, ఎర్లీ 2000 కిడ్స్ అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. తమ ఓల్డ్ డేస్ గుర్తుకొచ్చేస్తాయి. ఓవరాల్ గా సినిమా ఒక మంచి.. ఫ్యామిలీతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేసేలా ఉంది.

నటీనటుల పర్ఫామెన్స్:
మౌళిని చూస్తే ఇండస్ట్రీకి మరో కొత్త కామెడీ, లవ్ సినిమాలు చేసే హీరో దొరికిన ఫీల్ కలుగుతుంది. నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాడు. శివాని తన సింపుల్ లుక్ తో 2015 టైంలో అమ్మాయిలు ఇలానే ఉండేవాళ్ళ అన్నట్లు కనిపించింది. పర్ఫెక్ట్ గా కాత్యాయని పాత్రలో మెప్పించింది. రాజీవ్ కనకాల తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు. సీనియర్ నటుడు ఎస్ ఎస్ కాంచి సైతం మెప్పించారు. సత్య కృష్ణ, అనిత చౌదరి తల్లి పాత్రల్లో మెరిశారు. ఫ్రెండ్స్ పాత్రల్లో జయకృష్ణ తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా న‌వ్వించేస్తాడు. మరో ఫ్రెండ్ పాత్రలో నిఖిల పూరి అక్కడక్కడ కనిపించినా.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మిగిలిన ప‌టిన‌టులు.. ఎవరి పాత్రలో వాళ్ళు ఆకట్టుకున్నారు.

Little Hearts Trailer Launch Tomorrow | Mouli Tanuj Prashanth & Shivani Nagaram Starrer Releasing September 5 - Telugu Bullet

టెక్నికల్ గా:
సినిమాటోగ్రఫీ, విజువల్స్ నాణ్యంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ సినిమాకి హైలెట్. సాంగ్స్ రిపీటెడ్ మోడ్లో వినొచ్చు అన్న ఫీల్ కలుగుతుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. 2015 బ్యాక్ డ్రాప్ లో మూవీ చూపించడానికి.. ఆర్డర్.. తగిన జాగ్రత్తలు అన్ని తీసుకున్నారు. నవ్వించడమే లక్ష్యంగా సింపుల్ లవ్ స్టోరీని ఎంతో అందంగా రాశారు. మొదటి సినిమా అయినా పర్ఫెక్ట్ గా డీల్ చేసాడు డైరెక్ట‌ర్‌. నిర్మాణ పరంగా సినిమా నాణ్యత తెలుస్తుంది.

ఫైనల్ గా:
లిటిల్ హార్ట్స్ ఆడియన్స్ ను నవ్వించే క్యూట్ ప్రేమ కథ చిత్రం.

రేటింగ్: 4/5