సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే చాలు.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.. నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తారు అనడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ మలయాళం మూవీ కొత్తలోక. దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాలో.. కళ్యాణి ప్రియదర్శి మెయిన్ లీడ్ గా నటించింది. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసింది.
బాలీవుడ్ సినిమాలను సైతం పల్టీ కొట్టించి ఊహించని రేంజ్ లో రికార్డుల వర్షం కురిపించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. కేవలం 15 రోజుల్లో మలయాళం లో రూ.74.7 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిందని.. సాక్‌నిల్క్ వెల్లడించింది. గతంలో కేరళలో రూ.73 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన బాహుబలి 2 రికార్డును ఈ సినిమా కేవలం 15 రోజుల్లో చిత్తుచిత్తు చేసిందట.
ఈ విజయం సినిమాకు వచ్చిన ప్రేక్షకాదరణ, బలమైన మౌత్ టాకే ఉదాహరణ. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా సినిమా కేవలం 13 రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్ దాటేసి అతి తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడు జీవితం, ఆవేశం లాంటి సినిమాల రికార్డులను సైతం బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది. ఇక 15వ రోజు ఈ సినిమా రూ.3.85 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టిందట.