కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గత మూవీ కూలీ భారి అంచనాలతో రిలీజై ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే సినిమా పై డైరెక్టర్ లోకేష్ కనకరాజు రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇకపై నేనెప్పుడూ ప్రజల అంచనాలకు తగ్గకుండానే సినిమాలు చేస్తానంటూ వివరించిన లోకేష్.. నా ఆలోచనలకు తగ్గట్టుగానే కథలు రాసుకుంటానని.. దాన్ని సినిమాగా తీస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ క్రమంలోనే మరో సెన్సేషనల్ డెసిషన్ తాను తీసుకున్నట్లు వివరించాడు.
ఇంతకీ అదేంటంటే.. తను భవిష్యత్తులో ఏ సినిమా తీసిన కచ్చితంగా ఆనిరుధ€్ సినిమాకు పనిచేసేలా చూస్తానని.. అనిరుధ్ లేకుండా ఒక్క సినిమా కూడా తీయనంటూ కామెంట్స్ చేశాడు. సినీ ఇండస్ట్రీని వదిలేస్తేనే నేను ఇతర ఆప్షన్ల గురించి ఆలోచిస్తాను అంటూ లోకేష్ కనకరాజు చేసిన కామెంట్స్ అందరికి షాక్‌ను కలిగిస్తున్నాయి. నాకు పాటల్లో అసలు ఏఐ అవసరం లేదని.. ఎందుకంటే నా దగ్గర అనిరుధ్ ఉన్నడంటూ ఆయన స్ట్రాంగ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
కాగా.. లొకేషన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన కార్తీ (ఖైదీ) సినిమాకు మ్యూజిక్ సామ్ సి.ఎస్ అందించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. లోకేష్ తన నెక్స్ట్ సినిమాలన్నింటికీ అనిరుధ్‌నే కచ్చితంగా తీసుకుంటానని చెప్పడంతో.. ఖైదీ 2కి కూడా సామ్ సి.ఎస్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తప్పించినట్లే అని క్లారిటీ వచ్చేసింది. ఇక గతంలో కూలీ తర్వాత ఖైదీ 2 సినిమా ప్రారంభిస్తారు అంటూ టాక్ వినిపించినా.. ఇప్పుడు లోకేష్ తన ప్లాన్ మార్చుకున్నాడట. రజనీకాంత్, కమలహాసన్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. మరో వైపు.. త్వరలోనే అరుణ్ మాదేశ్వరం డైరెక్షన్‌లో లోకేష్ హీరోగా కూడా ఎంట్రీ ఇవనున్నాడు.