” ఘాటీ ” ట్విట్టర్ రివ్యూ.. అనుష్క, క్రిష్ మూవీ టాక్ ఇదే..!

టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ” ఘాటీ ” . క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా నేడు గ్రాండ్‌ లెవెల్‌లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. యూవి క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ మూవీలో అనుష్క గిరిజన మహిళగా.. ఫుల్ ఆఫ్ వైలెంట్ లుక్‌తో కనిపించింది. ఇక సెన్సార్ కంప్లీట్ చేసిన ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో.. బోర్డు సభ్యులు చాలా సన్నివేశాలను కట్ చేపించి.. యూ\ఏ సర్టిఫికెట్ను అందించారు.

గతంలో క్రిష్, అనుష్క కాంబోలో తెరకెక్కిన వేదం మంచి సక్సెస్ అందుతుంది. అలాగే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క ప్రమోషనల్ కంటెంట్ జ‌నాని మెప్పించ‌డంతో సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇక కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇప్పటికే ఓవర్సీస్‌లో స్పెషల్స్ షోలను ముగించుకుంది. ఇక సినిమా చూసేసిన‌ ఆడియన్స్ తమ ఎక్స్పీరియన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక అనుష్క, క్రిష్ సినిమాతో ఆడియన్స్‌ని మెప్పించారా.. సినిమా హిట్టా.. ఫటా.. చూద్దాం.

” ఘాటీ ” సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోయింది అంటూ మరికొందరు చెప్తున్నారు. అనుష్క చాలా కాలం తర్వాత తన రేంజ్ కు తగ్గ పర్ఫెక్ట్ సినిమా తీసిందని.. క్యారెక్టర్ అద్భుతంగా ఉంది.. యాక్షన్ సీన్స్ లో దుమ్ము దుల్లగొట్టేసింది.. లేడీ పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించింది.. ఫస్ట్ హ‌ఫ్‌లో కొన్ని డైలాగ్స్, సీన్స్ ఉన్న క్రిష్ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను లాక్కొచ్చాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ తో పలకరించిన క్రిష్ గట్స్‌కు, అనుష్క ధైర్యానికి మెచ్చుకోవచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్వీటీ గ‌త సినిమాలు అరుంధ‌తి, భాగ‌మ‌తి సినిమాల‌ను మించిపోయే రేంజ్ లో ఈ మూవీ ఉందని.. పక్కా బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్ చేస్తున్నారు.

అయితే మ‌రోప‌క్క‌ సినిమాను మరి రా అండ్ రెస్టిక్ గా, బ్లడీ గా చూపించాడని.. క్రిష్ డైరెక్షన్ వరస్ట్ గా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. స్టోరీ వీక్ గా ఉంది. అనుష్క గెటప్ చాలా వయసున్న పెద్దమ్మాయిలా వింత గెటప్‌లో మెరిసిందని.. తన నటన చాలా ఫ్లాట్ గా ఉంది. విక్రమ్ ప్రభుని కూడా సరిగా వాడుకొ లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బిజిఎం ఓవర్గా ఉందని.. అనవసరమైన సందర్భాల్లో.. చెవులు పగిలిపోయే రేంజ్ లో మోత మోగించార‌ని.. మూవీలో కంటెంట్ కంటే వైలెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది అంటూ మండిపడుతున్నారు. క్రిష్ నుంచి ఇలాంటి కథ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ చెబుతున్నారు. ఇలా ప్రస్తుతం మిక్స్డ్ టాక్ దక్కించుకుంటున్న ” ఘాటీ ” ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో తెలియాలంటే.. ఫుల్ రివ్యూ వరకు వెయిట్ చేయాల్సిందే.