నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయాలలో ఏ రేంజ్ లో దుమారంగా మారాయో.. ఎంత హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. కరోనా టైంలో సినీ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్‌ని కలిసిన మెగాస్టార్ పేరు ఆయన ప్రస్తావించడం మరింత చర్చనీయాంసంగా మారింది. బాలకృష్ణ మాటలు చిరంజీవిని అవమానించే రీతిలో ఉన్నాయని వివాదం మొదలైంది.
దీనిపై.. ఇప్పటికే చిరంజీవి రియాక్ట్ అయ్యాడు. ఇన్ని రోజులు విదేశాల్లో ఉన్న ఆయన.. ఒక వీడియో ద్వారా బాలయ్య కామెంట్స్‌కు రియాక్ట్ అయ్యారు. అయితే.. తాజాగా ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే మరోసారి బాలయ్య కామెంట్స్ పై ఆయన ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ వైరల్ గా మారుతుంది. వెకేషన్ ముగించుకుని ఇండియాకు వచ్చిన చిరు.. హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌లో విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆయనను ప్రశ్నించుగా.. చిరు ప్రశ్నలన్నీ దాటేశారు.
నేను చెప్పాల్సిన విషయాలు ఇప్పటికే పత్రిక ప్రకటనలో చెప్పేశా. ఇకపై ఈ విషయం గురించి నేనేం మాట్లాడాల్సింది లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ.. ఎయిర్‌పోర్ట్‌లో చిరంజీవి సందడి చేశాడు. అయితే.. ఇప్పటికే బాలకృష్ణ, చిరంజీవిల మధ్య ఈ మాటలు యుద్ధం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అభిమాన వర్గాల్లోనూ ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంసంగా మారింది. ఈ క్రమంలోనే బాలయ్య మళ్ళీ తన కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతారు.. లేదా వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందా.. వీళ్ళిద్దరి మధ్యన కామెంట్స్‌కు పవన్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి.