టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా.. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలతో ఎలాంటి క్రెజ్‌ను సంపాదించుకున్నాడు. బాక్స్ ఆఫీస్‌ను ఏ రేంజ్లో షేక్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సందీప్ రెడ్డి థాట్స్, విజన్ ఎప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లోనే ఉంటుంది. ప్రతి ఒక్క ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ స్నిరిట్ అని అందరికీ తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన టీం.. ఈ సినిమా కోసం అన్ని సిద్ధం చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో కూడా సెట్లు, టెక్నికల్ టీం రెడీ చేస్తూ అన్ని పనులను సందీప్ ఇప్పటికే చక్కబెట్టుకుంటున్నాడు.
ఇక పాటల రికార్డింగ్ కూడా తేది దశకు చేరుకుందని టాక్. ఈ ఏడాది చివర్లో సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఇలాంటి క్రమంలో.. సందీప్ రెడ్డి వంగాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. సందీప్ వంగా ఓన్ ప్రొడక్షన్ బ్యానర్.. భద్రకాళి పిక్చర్స్‌కు పరిచయాలు అవసరం లేదు. ఈ బ్యానర్ లో సందీప్ ఓ చిన్న సినిమాను ప్లాన్ చేస్తున్నడట. టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసిన వేణు అనే వ్యక్తిని ఈ సినిమాకు డైరెక్టర్గా పరిచయం కానున్నాడు.
సందీప్ హీరోగా మేము ఫేమస్.. ఫేమ్ సుమన్ ప్రభాస్ ను సెలెక్ట్ చేసుకున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా ఇది తెరకెక్కనుంది. ప్రజెంట్ హీరోయిన్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టిన టీం.. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్‌గా వెళ్లడించనున్నారు. సందీప్ రెడ్డి నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు.. ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో హైప్ మొదలవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. ఈ సినిమాపై కూడా ఇండస్ట్రీ దృష్టి పడింది. కాగా.. ఇది చిన్న సినిమానే అయినా.. సందీప్ నుంచి స్పిరిట్ కంటే ముందు ఈ సినిమా రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తుంది. ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో ముందు ముందు ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి.