టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చిరు నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల్లోనే కాదు.. సాధారణ సినీ ఆడియన్స్‌లోను ఆ సినిమాపై హైప్ మొదలైపోతుంది. చిన్నచిన్న సెలబ్రిటీస్ నుంచి.. స్టార్ హీరో, హీరోయిన్ల వరకు ఆయనతో నటించే ఛాన్స్ వస్తే బాగుంటుందని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. ఇక హీరోయిన్స్ అయితే చిరంజీవితో నటించే ఛాన్స్ వస్తే అసలు మిస్ చేసుకోరు. కాల్ షీట్లు ఇబ్బందిగా ఉన్న కూడా.. సర్దుబాటు చేసుకుని సినిమాలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆరాటపడతారు.
ఇలాంటి క్రమంలో చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఓ స్టార్ హీరోయిన్ తప్పకుందంటూ టాక్ వైరల్‌గా మారింది. ఇంతకీ అమ్మడు ఎవరో కాదు కేథరిన్ థెరెస్సా. ఎస్.. ఈ సినిమా నుంచి కేథరిన్ తప్పుకుందట. ఇక సినిమా సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జంటగా.. నయనతార ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. అదే టైంలో సెకండ్ హీరోయిన్గా కేథరిన్ ధెరెస్సా కూడా సినిమాలో నటిస్తుందంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
కేథరిన్‌కు ఇది ఒక జాక్పాట్ అవకాశమని.. ఈ సినిమాతో మంచి బ్రేక్ దొరుకుతుందని అభిమానులు భావించారు. చిరంజీవితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే మరోసారి మార్కెట్ ను పెంచుకోవడమే అని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇలాంటి టైం లో అమ్మడు సినిమా నుంచి తప్పుకోవడం అందరికి షాక్‌ను కలిగిస్తుంది. ఇంతకీ అసలు కారణమేంటంటే.. ఆమె హెల్త్ ప్రాబ్లంస్ అట. అనారోగ్యం వల్లే ఈ సినిమాను వదిలేసుకోవాల్సి వచ్చిందంటూ ఫిలిం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఫ్యాన్స్‌కు ఇదొక పిక్ డిసప్పాయింట్మెంట్‌గా మిగిలింది. అయితే ఆమె తప్పుకోవడానికి మరో కారణం ఉందట. నయన్ లాంటి స్టార్ బ్యూటీ ఫస్ట్ హీరోయిన్‌గా చిరంజీవితో నటిస్తుంటే.. ఫోకస్ అంత ఆమెపైనే ఉంటుంది కానీ.. సెకండ్ హీరోయిన్ కు ఇంపార్టెన్స్ ఏముంటుందనే ఉద్దేశంతోనే కేథరిన్ ఈ సినిమా నుంచి తప్పకుందని టాక్. అయితే తప్పుకోవడం పై సరైన కారణం మాత్రం ఇప్పటివరకు అఫీషియల్ గా తెలియలేదు. ఇక ఇప్పుడు కేథరిన్ ప్లేస్ లో సెకండ్ హీరోయిన్ గా ఎవరు ఎంట్రీ ఇస్తారో.. చిరంజీవికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఆ ముద్దుగుమ్మ ఎవరో అనే సందేహాలు మొదలయ్యాయి.